Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sexual Harassment: తూచ్..నాపై లైంగిక వేధింపులు జరగలేదు

–ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌ల్లో నిజం లేదు
–హైకోర్టులో సాక్ష్యం చెప్పిన మ‌హిళ
–ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు క్లోజ్‌
— ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన‌వ‌న్నీ వాస్త‌వాలు కాద‌న్న మ‌హిళ‌
— స్వ‌యంగా కోర్టుకొచ్చి అఫిడ‌విట్ దాఖ‌లు
–హ‌నీ ట్రాప్‌గా అభివ‌ర్ణించిన ఎమ్మెల్యే త‌ర‌పు న్యాయ‌వాది
— ఇరువురి వాద‌న‌లు విని కేసు కొట్టేసిన న్యాయ‌మూర్తి

Sexual Harassment:ప్రజా దీవెన అమరావతి: సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట లభిం చింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును (Sexual Harassment) ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. తనను బెదిరించి అత్యాచారం చేశార‌ని తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా.. ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసును (case) కొట్టేయాల‌ని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు (complaint)చేశారన్నారు. ‘వలపు వల’ (హనీట్రాప్‌)గా దీన్ని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్‌ నమోదు చెల్లదనీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరారు.

అవ‌న్నీ వాస్త‌వాలు కాద‌న్న‌ మ‌హిళ‌..

ఫిర్యాదు చేసిన మహిళ తరఫున న్యాయవాది కె. జితేందర్‌ (Jitender)వాదనలు వినిపించారు. ఆ మహిళ కూడా స్వయంగా కోర్టుకు హాజరై ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.