–అధికార మార్పుడికి అమెరికా కుట్ర పన్నింది
–సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వ భౌమత్వానికి ప్రయత్నం
–మృతదేహాల ఊరేగింపు చూడా ల్సిన అవసరం రాకూడదనే రాజీ నామా
–బంగ్లాదేశ్ క్షేమంకై ప్రార్ధిస్తూనే త్వర లోనే బంగ్లాదేశ్‌కు వెళ్తాను
— బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు
Sheikh Hasina: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధా ని షేక్ హసీనా (Sheikh Hasina)తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగు బాటు, అల్లర్ల వెనుక కూడా అగ్ర రాజ్యం హస్తం ఉందన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకాలోని నివాసం నుంచి వెళ్లే ముందు జాతి నుద్దేశిం చి ఈ అంశంపై ప్రసంగించాలని ఆ మె భావించారు. అయితే ఆమెకు ఆ అవకాశం రాలేదు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆమె తన సన్ని హితులతో పంచుకున్న ఆ ప్రసంగ పాఠం బహిర్గతమైంది. కేవలం మృతదేహాల ఊరేగింపు చూడాల్సి న అవసరం రాకూడదనే రాజీనా మా చేశాను. విద్యార్థుల మృతదేహా లపై వారు అధికారంలోకి రావాలను కున్నారు. అందుకు నేను అనుమ తించలేదు.
సెయింట్ మార్టిన్ ద్వీ పంపై సార్వభౌమత్వాన్ని అప్పగిం చి బంగాళాఖాతంపై అమెరికా ఆధి పత్యాన్ని చెలాయించడానికి అను మతించి ఉంటే ఆధికారంలో కొన సాగి ఉండేదాన్ని అంటూ దయచేసి రాడికల్స్ చేతిలో మోసపోవద్దు అని దేశ ప్రజలను ఆమె వేడుకు న్నారు. ‘ఒకవేళ నేను బంగ్లాదేశ్‌లో నే ఉండి ఉంటే మరింతమంది ప్రాణాలు పోయి ఉండేవి. మరిన్ని వనరులు ధ్వంసమయ్యేవి. అందు కే నా అంత నేనే రాజీనామా చేశా. మీరే నా బలం. మీరు వద్దనుకున్నా రు కాబట్టి వెళ్లిపోతున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి హసీనా పేర్కొన్నారు. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు వెళ్తానని స్పష్టం చేశా రు. బంగ్లాదేశ్ క్షేమం కోసం భగవం తుడిని ప్రార్థిస్తానని చెప్పారు. నిరస నలో ఉన్న విద్యార్థులను రజాకార్లు అని తానెప్పుడూ సంబోధించలేద న్నారు.షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినందుకు బంగ్లాదేశ్ ప్రజ లను(People of Bangladesh) అభినందిస్తూ అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ తాజాగా 12 పేజీల ప్రకటన విడుదల చేసింది.
దీన్ని ఈ ప్రాంతంలో ఇస్లామిస్టులు, జిహాది స్టుల (Islamists and jihadists) విజయంగా అభివర్ణించింది. ఇస్లామిస్టులు కొత్త ప్రభుత్వంలో భాగస్వాములయ్యే బదులు దేశం లో పూర్తి షరియా పాలన తీసు కొచ్చేందుకు ప్రయత్నించాలని ఏక్యూ ఐఎస్(అల్ కాయిదా భారత ఉపఖండం) చీఫ్ ఒసామా మసూద్ సూచించారు. మరోవైపు… గ్రామీణ టెలికాం కార్మికులు, ఉద్యోగుల సంక్షేమ నిధిని (Rural Telecom Workers and Employees Welfare Fund)దుర్వినియోగం చేసినట్లు అవినీతి నిరోధక కమిషన్ ఇదివరకు దాఖలు చేసిన కేసు నుంచి బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్‌కు విముక్తి లభించింది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 11 మందిని బీఎస్‌ఎఫ్ అదుపులోకి తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లో ఇద్దరిని, త్రిపురలో ఇద్దరిని, మేఘాలయలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన విశ్వవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై (Temples, houses, business establishments) దాడిని నిరసి స్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభా వంగా వేలాదిమంది ముస్లింలు, విద్యా ర్థులు (Muslims, Educators) ఆందోళనల్లో పాల్గొ న్నారు.
మైనారిటీలను వేధిస్తున్న వారిపై విచారణ వేగవంతానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో 10 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ (demand) చేశారు. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో నిరస న సందర్భంగా మూడు గంటలపా టు ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువు లపై హింసా త్మక దాడులు పెరగడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. దాడులను ఖండిస్తూ లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధా న నగరాలలో ప్రదర్శనలు నిర్వహిం చారు. లండన్‌లోని పార్లమెంటు భవనం ఎదుట ఆందోళనకారులు బంగ్లాదేశ్ జెండా, చిహ్నంలతో నిరసన తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమం లో వివిధ మానవహక్కుల సంఘా ల సభ్యులు పాల్గొన్నారు. ఐక్యరా జ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద కూడా శనివారం ఆందోళన నిర్వహించారు. కాగా, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మొహమ్మద్ యూనస్ ఖండించా రు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను కాపాడవలసిందిగా యువతను కోరారు.