Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shooting in America: అడ్డగోలుగా అమెరికాలో కాల్పులు,బలైన అమాయకులు

ప్రజా దీవెన , అమెరికా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్‌ లోని మాడిసన్‌లో ఉన్న అబం డంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో విరు చుకుపడ్డాడు. దీంతో టీచర్‌ సహా ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతు ల్లో నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠ శాలలో కాల్పుల ఘటనతో ఒక్క సారిగా భయాందోళనలు నెల కొన్నాయి. భారీగా పోలీసు వాహనాలు, అంబులెన్సులు, ఫైరిం జన్లు స్కూల్‌ వద్ద మోహరించాయి.

గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉం దని మాడిసన్‌ పోలీస్‌ చీప్‌ షాన్‌ బార్న్స్‌ తెలిపారు. మరో ఇద్దరు దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యా రన్నారు.మృతుల్లో టీచర్‌తోపాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారన్నా రు. నిందితుడు హాండ్‌గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడని, అతడు కూడా చనిపోయాడని వెల్లడిం చారు. కాగా, కాల్పుల ఘటనను అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండిం చారు.

అగ్రరాజ్యంలోని పాఠశా లల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారిపో యింది. ఈ ఏడాదిలో ఇప్పటివ రకు స్కూళ్లలో 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 1966 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. ఆ ఏడాది వివిధ స్కూళ్లలో 349 కాల్పుల ఘటనలు జరిగాయి.