Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sitakka: అంగన్వాడీలకు ఉద్యోగ విరమణ లబ్ధి

–టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాల కు రూ.లక్ష వరకు ప్రయోజనం
–రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం
–మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

Sitakka:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్రం లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) పనిచేసే టీచర్లు, ఆయాలకు (Teachers, Ayala) ఉద్యోగ విర మణ ప్రయోజనాలు అందించనున్న ట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Sitakka) తెలిపారు. దీంతో టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష వరకు లబ్ధి చేకూరుతుం దని పేర్కొన్నారు. ఇందుకు సంబం ధించిన ఫైల్‌ను ఆర్ధిక శాఖ ఇప్పటికే పరిష్కరించిందని, రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు విడుదల వుతాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ రహ్మత్‌ నగర్‌లో ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అంగన్‌వాడీల్లో (Anganwadi Centers)పనిచేస్తూ రిటైర్‌ అయినవారికి ఆర్థిక ప్యాకేజీ (Financial package)ఇస్తామని చెప్పి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే రిటైర్‌ అవుతున్న అంగన్‌వాడీలకు ప్రయోజనాలను ప్రకటించిందని వివరించారు. కాగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’ను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క కోరారు. కార్పొరేట్‌ స్కూళ్లకు తీసిపోనివిధంగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పిల్లలను అంగన్‌వాడీలకు పంపండి.. వారి బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది అని మంత్రి భరోసానిచ్చారు. మాతృత్వం, మానవత్వాన్ని మేళవించి పిల్లలను అక్కున చేర్చుకోవాలని టీచర్లు, ఆయాలకు సూచించారు. కార్యక్రమానికి ముందు పిల్లలతో కలిసి మంత్రి మొక్కలు (plant)నాటించారు.

స్వచ్ఛందంగా తప్పుకొన్నవారి కీ ఇవ్వాలి.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన అంగన్‌వాడీలకూ ప్రభుత్వం ప్రయోజనాలను వర్తిం పజేయాలని, ఉత్తర్వుల్లో పొందు పర్చాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌–హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు, ఆయాలకు ప్రకటించిన ప్రయోజ నాల పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.