Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Skill Development Case : కీలక మలుపు…తెరపైకి ఏపి స్కిల్ కేసు …రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Skill Development Case: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) ఈడీ దూకుడు పెంచింది. స్కిల్ కుంభకోణంలో సీమెన్స్ సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పుణెలలో ఉన్న సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. సీమెన్స్ సంస్థకు ఆయా ప్రాంతాల్లో ఉన్న రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఈడీ కార్యాలయం (Office of ED) అటాచ్ చేసింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.

అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం, 2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.మరోవైపు 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సీమెన్స్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గత వైసీపీ సర్కారు ఆరోపించింది. ఈ ప్రాజెక్టులో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది. సీమెన్స్ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారంటూ డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఇతరులుపై ఏపీ సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. ఇక ఈడీ తన దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండీ ఖాన్వేల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ (MD Khanvelkar, former Siemens MD Suman Bose), వారి సన్నిహితులు బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించారని గుర్తించారు.

ఇక ఇదే కేసులో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ (AP CID) అప్పట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. అనంతరం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇక చంద్రబాబు జైళ్లో ఉన్న సమయంలోనే ఏపీలో కూటమి మధ్య పొత్తు పొడిచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం పలికారు. అనంతరం జైలు బయట మీడియా సమావేశంలో టీడీపీతో (tdp) పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాతి కాలంలో వీరితో బీజేపీ కలవడం.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరుగులేని విక్టరీ కొట్టడం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఈడీ ఆస్తులను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరిం చుకుంది.