–ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం
–మహిళలు పారిశ్రామికవేత్తలుగా అంచలంచలుగా ఎదగాలి
–పారిశ్రామిక రంగంలో మహిళలు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుంది
–నేను విద్యనభ్యసించింది సె యిం ట్ ఆన్స్ పాఠశాలలోనే
–కోదాడ నియోజకవర్గంలోని సె యింట్ ఆన్స్ పాఠశాలకు తోడ్పాటు అందించాను
–తెలంగాణా లో వృత్తి నైపుణ్య వి శ్వవిద్యాలయం ఏర్పాటు
–మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆకాశ మే సరిహద్దుగా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని రాష్ట్ర నీటిపా రుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పే ర్కొన్నారు.ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని,మహిళా సాధికారత కు ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంద ని ఆయన చెప్పారు.మహిళలు పా రిశ్రామిక వేత్తలుగా ఏదగాల్సిన ఆ వశ్యకత ఎంతైనా ఉందని, పారిశ్రా మిక వేత్తలుగా ఎదుగుతున్న మ హిళలు వేసే ప్రతి అడుగులోనూ రా ష్ట్ర ప్రభుత్వం చేయూత నందిస్తుం దని ఆయన హామీ ఇచ్చారు. గురు వారం ఉదయం హైదరాబాద్ మో హిదిపట్నం లోని సెయింట్ ఆన్స్ క ళాశాల ప్రాంగణంలో ఆయన ఇ న్క్యూబేసిన్ కేంద్రాన్ని ప్రారంభించా రు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ ఇన్క్యు బే సిన్ కేంద్రాలు ఆర్థిక వ్యవస్థలకు వె న్నుముఖoగా నిలబడతాయాన్నా రు. ఇలాంటి కార్యక్రమాలు విద్యా రంగం పరిశ్రమలతో కలసి ఏర్పాటు చేస్తే ప్రపంచ స్థాయిలో వారికి అవ కాశాలు పుష్కలంగా లభిస్తాయ న్నారు. ఈ ప్రక్రియలో మహిళలు అ గ్రభాగాన ఉండాలని ఆయన చెప్పా రు.జనాభాలో సగభాగంలో ఉన్న మహిళలు భాగస్వామ్యం లేకపోతే ఎంతో సామర్ధ్యాన్నీ కొల్పయిన వా రమౌతామన్నారు.
మహిళా పారిశ్రామిక వేత్తలకు సె యింట్ ఆన్స్ ప్రారంభించిన ఇ న్క్యూబేసిన్ ఫౌండేషన్ మార్గదర్శ నంగా మారనుందన్నారు.కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా హె ల్త్ కేర్,విద్య,గ్రామీణాభివృద్ధి డిజి టల్ రంగాల అభివృద్ధిలకు దోహద పడుతుందన్నారు. అందుకు తె లం గాణా ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పారు. టి-హబ్,వి-హబ్ స్టార్టప్ లతో సరి సమానంగా సెయింట్ ఆ న్స్ లో ప్రారంభం అయిన ఇన్క్యూ బేసిన్ ఫౌండేషన్ మహిళలు పారి శ్రామిక రంగంలో రాణించేందుకు పు నాదిగా మారనుందని ఆయన ఆ శాభావం వ్యక్తం చేశారు.
పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడి దా రులను పూర్వ విద్యార్థులు కలుపు కుని ఈ ఇన్క్యూబేసిన్ ఫౌండేషన్ ను సామాజిక పారిశ్రామిక వేత్తలకు పరిశోధన కేంద్రంగా రూపొందించా లని ఆయన చెప్పారు.సెయింట్ ఆ న్స్ విద్యా సంస్థలతో తన అనుబం ధం ఇప్పటిది కాదని తన విద్య మొ దలు అయ్యిందే బిహెచ్ఇఎల్ సె యింట్ ఆన్స్ విద్యాసంస్థల నుండ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గు ర్తు చేసుకున్నారు.ఇక్కడ నేర్చుకు న్న క్రమశిక్షణ, నైతిక విలువలు, న డవడిక ఇప్పటికీ మరచిపోలేదన్నా రు.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాల తో నా అ నుబంధం విడదియలేనిదని ఆ బం ధమే నేడు నన్ను ఇక్కడికి రప్పిం చిందన్నారు.నాజీవితంలో నేను పని చేస్తున్న వృత్తులు ఎన్ని మలు పులు తిరిగినా ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, నైతిక విలువలు నా జీవి తంలో భాగస్వామ్యం అయ్యాయ న్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరి అటునుండి పైలెట్ గా జీవి తం మొదలు పెట్టిన తాను చైనా, పా mకిస్థాన్ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం MIG-21,MIG-23 వంటి యుద్ద విమానాలు నడపడం వరకు పనిచేసిన అనుభూతి, రాష్ట్రపతు లు ఆర్.వెంకట్ రామన్,శంకర్ ద యాల్ శర్మ ల వద్ద పని చేసిన అ నుభవం నా అదృష్టంగా భావిస్తు న్నానన్నారు.
ఆ తరువాత కాలక్రమంలో రాజకీ యాలలో అడుగిడిగి వరుసగా ఆ రు సార్లు శాసనసభ్యుడిగా, ఒక మారు లోకసభ సభ్యడిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలోను మంత్రి గా పిసిసి అ ధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించా నన్నారు.కళాశాలలో ఎన్.సి.సి కే డెట్ల పరేడ్ ను చూసిన ఆయన ఎ న్.సి.సి బలోపేతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.భారతదేశానికి యువత తరగని ఆస్తి అని అట్టి యువత అత్యున్నతులుగా ఎదగక పోతే నిష్ప్రయోజనంగా మారు తుందన్నారు.
అటువంటి యువతను అత్యున్న తులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగం గా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధా నిలో మొట్ట మొదటిసారిగా వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పా టుకు శ్రీకారం చుట్టిందన్నారు. త ద్వారా ప్రపంచం కూడలిలో ఎక్కడ నిలుచున్న ఉపాధి అవకాశాలు వె తుక్కుంటూ వచ్చేలా తీర్చిదిద్దుతా మన్నారు.ప్రపంచంలోని నగరాలలో హైదరాబాద్ నగరం విశిష్టమైనదని అటువంటి హైదరాబాద్ ను గ్లోబల్ నగరంగా రూపాంతరం చెందేలా ప్ర ణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలి పారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ పాఠశాలలు,కళాశాలల అధ్యక్షురా లు మదర్ అంతోనమ్మ, హైదరాబా ద్ ప్రావిన్స్ పాఠశాల విద్యా సంస్థల కు చెందిన డాక్టర్ సిస్టర్ ఏ.విజయ రాణి, ఎన్.ఐ-యం.ఎస్.యం.ఇ డైరెక్టర్ డాక్టర్ విజయ ఏరండి, టి. హబ్ సి.ఇ. ఓ సీత పల్లచోల్ల, ఉస్మా నియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నారాయణ రెడ్డి త దితరులు పాల్గొన్నారు.