–స్వరం వణుకుతున్నా నిజమే మాట్లాడండి
–దివ్యాంగుల కోటా వ్యాఖ్యలపై వి వాదం వేళ స్మితాసబర్వాల్ మరో ట్వీట్
Smithasabarwal:ప్రజా దీవెన హైదరాబాద్: దేశంలోనే సంచలనం సృష్టించిన సివిల్ సర్వీ సెస్ (Civil Service Cess) ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు అంటూ తలెత్తిన అంశం ఇప్పట్లో సద్దుమణిగా పరిస్థితి కనబడటం లేదు. సివిల్ సర్వీసెస్లో వికలాంగుల కోట విషయంలో ఇటీవల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితాసబర్వాల్ (Smithasabarwal) చేసిన పోస్ట్ వివా దాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలు వ్యక్తం అయ్యాయి విషయం విదితమే. మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి హరీశ్రావు (Minister Sitakka, Deputy CM Bhatti, former Minister Harishrao) సహా పలువురు స్మితా సబర్వాల్ (Smithasabarwal) వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె మరో సంచలన ట్వీట్ చేశారు. ‘కెరీర్ పబ్లిక్ లో పుట్టి నా క్యారెక్టర్, బలం ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు, స్వరం వణుకుతున్నా నిజాన్నే మాట్లా డండి అని పోస్ట్ చేశారు. అయితే ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాజాగా ఆమె ఈ ట్వీట్ చేసినట్లు నెట్టింట విస్తృత చర్చ జరుగుతోంది.