Praja Deveena
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 12:35 pm Posted by : praja deveena

Mahatma Gandhi University : ఎంజీయూలో విద్యార్ధులకు సామా జిక అవగాహన సదస్సు 

Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మహాత్మా గాంధీ విశ్వవి ద్యా లయంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సా మా జిక అవగాహన, ఆరోగ్య చైతన్యం, ముఖ్యంగా హెచ్ఐవీ, ఎయిడ్స్ ని వారణపై అవగాహన పెం పొందిం చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని విజ యవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌ ఎస్‌ఎస్ సెల్,డి డి ఓ, డి వై యస్ ఓ తెలం గాణకు చెందిన జి. నర్సింహ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డుతూ యువత సామాజిక బాధ్య తను గుర్తించి సేవాభావంతో ముం దుకు రావాల్సిన అవసరం ఉంద న్నారు. విద్యార్థులు ఎన్‌ఎస్‌ ఎస్ కార్యక్రమాల ద్వారా వ్యక్తిత్వ వికా సంతో పాటు సమాజానికి ఉపయో గపడే సేవలు అందించవచ్చని సూ చించారు.

నల్లగొండ ఏ పీ ఏ ఐ నిఖత్ ఉన్నిసా మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో అవగాహన ఎంత కీలకమో వివరిం చారు. ముఖ్యంగా యువతలో సరై న సమాచారం ద్వారా అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంద న్నారు. సీనియర్ ట్రైనర్ కలారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు సి పి ర్ ద్వారా ఏ విధంగా కాపాడాలో తె లియ జేశారు.హెచ్ఐవీ, ఎయిడ్స్ పై విస్తృత అవగాహన సదస్సు ని ర్వహించి, వ్యాధి వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, పరీక్షల ప్రాము ఖ్యతను సులభంగా వివరించారు.అలాగే దేవయ్య ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, హైదరాబాద్ ప్రతినిధులు విద్యార్థులకు అవసరమైన సమా చారాన్ని అందించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ హిం చిన మహాత్మా గాంధీ యూని వ ర్సి టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకట్ ర మణరెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ ఎ స్ ద్వారా విద్యార్థులు సామాజిక సే వలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహి స్తామని చెప్పారు. ఎంజీయూ రిజి స్ట్రార్ ప్రొఫెసర్ రవి అలువాల మా ట్లాడుతూ విశ్వవిద్యాలయం వి ద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎన్‌ ఎ స్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తోంద న్నా రు. విద్యార్థులు నేర్చుకున్న విష యాలను సమాజంలో ప్రచారం చే యాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వా లంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్య లో పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.