–విధులు, బాధ్యతలను నిర్వర్తిం చకుండా హక్కులను అనుభవిం చలేరు
-‘హెచ్ ఎన్ ఎస్ చికిత్సాలయ్’ ప్రా రంభోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Telangana Governor Jishnu Dev Varma : ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జాన్ని అభివృద్ధి చేయడం సమా జంలోని ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర గ వర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అం దులో భాగంగా వివిధ వర్గాల సం ఘాలు, స్వచ్ఛంధ సేవా సంస్థలు ఎ వరి శక్తి మేరకు వారు సేవా కార్యక్ర మాలను కొనసాగించాలన్నారు. హ ర్యాణా నాగరిక్ సంఘ్ (హెచ్. ఎ న్.ఎస్ ) వారి సభ్యులతో పాటు పే దలకు కనీస చార్జీలతో వైద్య సేవ లందించడం అభినందనీయమ న్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సిక్ విల్లెజ్ లో హర్యాణా నాగరిక్ సంఘ్ (హెచ్ ఎన్.ఎస్) ఆధ్వర్యం లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్’ను గ వర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్ చైర్మన్ అంజనీకుమార్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పార్లమెంట్ సభ్యు లు ఈటల రాజేందర్, హెచ్. ఎన్.ఎ స్ అధ్యక్షులు పదమ్ జైన్, సలహా దారులు రామ్ గోయల్, హెచ్. ఎన్ ఎస్ చికిత్సాలయ్ అధ్యక్షులు పు రుషోత్తం అగర్వాల్, సికింద్రాబాద్ కంటోన్ బోర్డ్ సభ్యురాలు బి.నర్మద మల్లిఖార్జున్ తదితరులు ప్రసంగిం చారు.
సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్ర సంగిస్తూ సమాజం లేకుండా మ ను షుల మనుగడ అసాధ్యమని, స మాజం శక్తివంతంగా ఉంటేనే ప్ర జలు శక్తివంతంగా ఉంటారన్నారు. దేశ ప్రగతికి వైద్య సేవలు పునాది లాంటివని, కులం, మతం, ప్రాంతం, భాష అనే బేధాలు లేకుండా వైద్య సేవలు ప్రజలందరికీ అందాలన్నా రు. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరి కీ హక్కులు, విధులు ఉంటాయని, కానీ సమాజంలోని కొంత మంది తాము నిర్వర్తించే విధులను విస్మ రి స్తూ హక్కులను మాత్రమే అడుగు తున్నారన్నారు.
ప్రజలు సమాజంలో తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించకుండా హ క్కులను అనుభవించలేరని గవర్న ర్ స్పష్టం చేశారు. సమాజంలో అ త్యవసరమైన వైద్య సేవలను అం దించడంలో ప్రభుత్వ యంత్రాంగం తో పాటు హెచ్.ఎన్.ఎస్ చికిత్సాల య్ లాంటి స్వచ్ఛంధ సేవా సం స్థలు భాగస్వామ్యం కావడం అభి నందనీయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, అందు కోసం రాజ్ భవన్ ద్వారాలు ఎల్ల ప్పుడూ తెరిచే ఉంటాయని గవ ర్నర్ చెప్పారు.
హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్ చై ర్మన్ అంజనీకుమార్ అగర్వాల్ మా ట్లాడుతూ చికిత్సాలయ్ హెచ్.ఎ న్.ఎస్ సోసైటీ సభ్యులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారికి కనీస చార్జీలతో వైద్య సేవలు, వైద్య పరీక్షలను అందించచనున్నట్లు ప్రక టించారు. త్వరలోనే ఎం.ఆర్.ఐ తదితర ఆధునాతన వైద్య పరీక్ష లను కూడా ప్రజలకు అందుబా టులోకి తీసుకువస్తామని వెల్లడిం చారు. ప్రభుత్వం జారీచేసిన తెల్ల రేషన్ కార్డుదారులకు తమ చికిత్సా లయ్ ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు చర్యలు చేపడతా మన్నారు.
హెచ్.ఎన్.ఎస్ చికిత్సా లయ్ అధ్య క్షులు పురుషోత్తం అగర్వాల్ మా ట్లాడుతూ భవిష్యత్లో చికి త్సాల య్ లో మరిన్ని వైద్య సేవలు అం దించేందుకు ప్రణాళికలు రూ పొం దిస్తున్నామన్నారు. హెచ్.ఎన్. ఎస్ ఆసుపత్రిలో నిర్వహించే వైద్య పరీ క్షలను కార్పొరేట్ ఆసుపత్రులు కూ డా గుర్తించి ధృవీకరించే విధంగా, వి విధ రకాల ఉద్యోగులకు ఉండే బీ మా కార్డుదారులకు కూడా అవసర మైన వైద్య సేవలు అందించేందుకు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎన్.ఎస్ చికిత్సాలయ్ ప్రధాన కార్యదర్శి దీ పక్ బింజ్రాజ్ ఉపాధ్యక్షులు సుశీల్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శి సం దీప్ మిట్టల్, కోశాధికారి నారాయ ణ్ చౌదరి, హర్యాణా సేవా సంఘం అధ్యక్షులు రాజేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి వి రాళాలు అందజేసిన దాతలు, ట్రస్టీ లను గవర్నర్ ఘనంగా సత్కరిం చారు.