–తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ
Professor Jayashankar : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన ఏకైక ఉద్య మ నాయకుడు, తెలంగాణ సిద్దాం తకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని తె లంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నా రు. స్వీయ పాలనలో తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజాస్వామ్య తె లంగాణ, సామాజిక తెలంగాణను సాధించుకుందామని ప్రొఫెసర్ జ యశంకర్ ఆశించారని, కానీ పద కొండున్నర సంవత్సరాలుగా అది సాధ్యపడలేదని ఆయన ఆ వేదన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ జ యశం కర్ 91వ జయంతిని పురస్క రిం చుకుని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో గురువారం స్మార కోపన్యాసం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన అల్లం నా రాయణ ‘ప్రొఫెసర్ జయశంకర్, అ నంతర తెలంగాణ’ అనే అంశంపై ప్రసంగించారు. వనరుల పంపిణీలో ప్రాంతీయ అసమానతలకు మూల కారణంగా ఉన్న ఆంధ్ర పెట్టుబడిదా రి, ఆధిపత్య రాజకీయ నాయక త్వం వల్ల క్షేత్రస్థాయిలో అసంఘటి తంగా ఉన్న తెలంగాణ వాదాన్ని సంఘటితపరిచి బలమైన పునాదు లు వేయాలన్నది జయశంకర్ అభి మతమని, ఆ మేరకే ఆయన ఆలో చనలు ఉండేవని చెప్పారు. తెలం గాణ సాధించడానికి ఏవిధంగా ప్ర ణాళికలు రూపొందిస్తామో, తెలం గాణ వచ్చాక సమగ్ర అభివృద్ధి ప్ర ణాళికలు కూడా అంతే అవసరమ ని ప్రొఫెసర్ జయశంకర్ వివరించే వారని గుర్తుచేశారు.
సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉపాధి, విద్య, వైద్యం, సాంస్కృతిక వైభవం ముఖ్యమైన వని, జయశంకర్ పేర్కొనేవారని అ న్నారు. తెలంగాణ అభివృద్ధి దీర్ఘకా లిక ఆర్థిక, రాజకీయ, సాంఘిక పు నర్నిర్మాణం జరగాలని ఆకాంక్షించా రని తెలిపారు. విశ్వవిద్యాలయ ఉ పకులపతి ఆచార్య ఘంటా చక్రపా ణి, విశ్వవిద్యాలయ అకాడమిక్ డై రెక్టర్ ప్రొఫెసర్ పుష్పాచక్రపాణి, రిజి స్ట్రార్ విజయకృష్ణారెడ్డి, అన్ని విభా గాల అధి పతులు, డీన్స్, అధ్యా ప క సిబ్బంది పాల్గొన్నారు.