–ప్రజలంతా మనవైపే ఉన్నారని, తి ప్పుకునే ప్రయత్నం చేయండి
–మోదీ పాలన యావత్తు భయో త్పాతం, శతృత్వం
–నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
— అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ
Sonia Gandhi: ప్రజాదీవెన, ఢిల్లీ: కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని, అలా అతి విశ్వాసంతో ఉండొద్దని పార్టీ నేతలకు అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) సూచించారు. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో (Assembly fight) కూడా అదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోడీ సర్కార్ పాఠాలు నేర్చుకుంటుందని అనుకున్నామని అన్నారు. కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాలవారీగా విభజించి భయం, శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా (sonia)ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
“మనం ఆత్మసంతృప్తి చెందకూడదు. అలాగే అతి ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు. లోక్‌సభ ఎన్నికల్లో చూపిన తెగువను చూపించి పోరాడితే జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం. కావడి యాత్ర మార్గంలో హోటళ్ల ముందు యజమానుల పేర్లతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కార్ (Government of Uttar Pradesh and Uttarakhand) ఇచ్చిన ఉత్తర్వులపై అదృష్టవశాత్తూ సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకునేలా నిబంధనలను ఎన్డీఏ సర్కార్ అకస్మాత్తుగా ఎలా మార్చిందో చూడండి. ఆర్ఎస్ఎస్ తనను తాను సాంస్కృతిక సంస్థగా అభివర్ణించుకుంటుంది. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సైద్ధాంతిక పునాదని ప్రపంచమంతా తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఊపును, సానుకూలతను కొనసాగించాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి”
‘రైతులు, యువత డిమాండ్లను విస్మరించారు’
ముఖ్యంగా రైతులు, యువత డిమాండ్లను కేంద్ర బడ్జెట్లో (central budget) పూర్తిగా విస్మరించారని ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కీలకమైన అనేక రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని విమర్శించారు. 2021లో జరగాల్సిన జనాభా గణనను నిర్వహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. “ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తారు. కానీ అల్లర్లతో అతలాకుతలమైన మణిపుర్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మణిపుర్లో పరిస్థితులు ఇప్పటికీ కుదుటపడలేదు. దేశ భద్రత విషయంలో తీవ్ర కలవరపాటుకు గురిచేసే వార్తలు వస్తున్నాయి. వారాల వ్యవధిలోనే జమ్ము ప్రాంతంలో 11 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఉగ్రదాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు” అని సోనియా గాంధీ (sonia gandhi) వ్యాఖ్యానించారు.