Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Power : మోటార్ సైకిల్ దొంగల అరెస్ట్… రిమాండ్

–18.20 లక్షల ద్విచక్ర వాహనాలు , మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం

— వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్

SP Sarath Chandra Power : ప్రజాదీవెన నల్గొండ : మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. వారి వద్ద నుండి 24 మోటార్ సైకిల్ ల కు సంబంధించిన మొత్తం విలువ రూ.18,20,000 లను అదేవిధంగా 3 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ మద్య కాలం లో నకిరేకల్ పట్టణ పరిధిలలో మోటర్ సైకిళ్ళ వరుస దొంగతనాలు జరుగుతున్నాయన్న సమాచారంతో డి‌ఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో నకిరేకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశాము. గురువారం సాయంత్రం 5 గంటల సమయం లో నకరేకల్ సీఐ రాజ శేఖర్, యస్ఐ లచ్చి రెడ్డి, కానిస్టేబుల్ లు శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు లు 100 డయల్ సిబ్బంది తో నకరేకల్ టౌన్ లోని ఇందిరా గాంధి బొమ్మ చౌరాస్తా వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా, సాయంత్రం 6 గంటల సమయం లో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ TS 05 EP 6553 నెంబర్ గల ద్విచక్ర వాహనం మీద (ఏ1) పాలడుగు అశోక్, నెంబర్ ప్లేట్ లేని స్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు ఏర్పుల పరశురాములు, ఏ2, బోడ సాయిరాం ఏ3 తిప్పర్తి రోడ్ వైపు నుండి వస్తుండగా, ఆ రెండు మోటార్ సైకిల్ల ను ఆపి డాక్యుమెంట్లు, లైసెన్స్ లను చూపమనగా, వారి వద్ద లేవని చెప్పారు.

 

మొదట మోటార్ సైకిల్ TS 05 EP 6553 ను ఈ చలాన్ అప్ లో చెక్ చేయగా, నెంబర్ గ్లామర్ మోటార్ సైకిల్ ది గా చూపించినది. బైక్, నెంబర్ ప్లేట్ వేరేగా ఉండడంతో అనుమానం వచ్చి వారిని విచారించారు. ఆ మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి పాలడుగు అశోక్ తాను మోటార్ సైకిల్ ను నకరేకల్ లో దొంగతనం చేశానని, మోటార్ సైకిల్ కు వున్న TS05 ET 3097 నెంబర్ ప్లేట్ ను తీసి తన వద్ద వున్న ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ పరశురాములు గ్లామర్ బైక్ నెంబర్ ప్లేట్ కు బిగించి ఎవరికి అనుమానం రాకుండా తిరుగుచున్నాడని తెలిపారు. ఏర్పుల పరశురాములు (ఏ2), బోడ సాయిరాం(ఏ3) లు ముగ్గురు కలిసి నకరేకల్ లో 9 కేసులు, సూర్యాపేట01 కేసు, చౌటుప్పల్01 కేసు , హయత్ నగర్ 3 కేసులు, వనస్తలిపురం 1 కేసు, ఎల్బి నగర్ 5 కేసులు, చైతన్యపురి 1 ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా రెండు మోటార్ సైకిల్ ల వివరాలు తెలియ నందున కేసు ఏరియాలలో 24 మోటార్ సైకిల్ లను హోటల్ ల ముందు, బార్ షాప్ ల ముందు, ఇండ్ల ముందు పార్క్ చేసిన వాటిని పాత తాళం చెవి లతో లాక్ ఓపెన్ చేసి దొంగిలించుకొని పోయి వాటిలో కొన్నింటిని పరశురాములు, సాయిరాంలు తెలిసిన వారికి 11 బైకులను అమ్ముకున్నారు. మిగతా 13 బైక్ లను నిర్మాణం లో వున్న పాలడుగు అశోక్ ఇంటి వెనుకాల వద్ద దాచి పెట్టాడు. వాటిని స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. బైక్ దొంగలను పట్టుకున్న
నకిరేకల్ సిఐ రాజశేఖర్, యస్ఐ లచ్చి రెడ్డి, కానిస్టేబుల్ లు వెంకటేశ్వర్లు, శ్రీను, సురేష్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు ను జిల్లా యస్పీ అభినందించారు.