SP Sharath Chandra Pawar: ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లాలో ప్రతి సోమవా రం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వ చ్చిన దాదాపు 35 మంది అర్జీదా రులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబం ధిత అధికారులతో ఫోన్ లో మా ట్లాడి పూర్తి వివరాలు సమర్పించా లని ఆదేశించారు. ఈ రోజు ఎక్కు వగా భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రాగ బాధితుల ఫిర్యా దులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధం గా చూడాలని అన్నారు.
అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తంకి సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపో యిన నలుగురు బాధితులు నేరు గా పిర్యాదు మరియు ఆరుగురు బాధితులు ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యలు తెలియజేయడం జరి గింది.ఎవరైనా బాధితులు సైబర్ మాసాలకు గురి అయితే వెంటనే 1930 గాని,https://www. cyb ercrime.gov.in గాని సమాచా రం అందించాలని కోరారు.ప్రతి సోమవారం 11గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని మీ సమస్యలు తెలుసుకొనుటకు ఫోన్ నంబరు 8712658079 కాల్ చేయగలరని తెలిపారు.