Politicsతెలంగాణనల్గొండ

SP Sharath Chandra Pawar : ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం, చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతం లో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చ ర్యలు 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, చిట్యాల: రానున్న సం క్రాంతి పండుగ సందర్భంగా వాహ నాల రద్దీ అధికంగా ఉండే అవకాశా న్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్.హెచ్ 65 జాతీయ రహదారి చిట్యాల పె ద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కార ణంగా ప్రజలకు, హైవే ప్రయాణికుల కు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలె త్తకుండా ముందస్తు చర్యలు చేప ట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చిట్యా లపెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాం తాన్ని స్వయంగా సందర్శించి, అ క్కడ కొనసాగుతున్న పనులు, ట్రా ఫిక్ మళ్లింపు మార్గాలు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. పం డుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా ప్రత్యేక ట్రా ఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాల ని సూచించారు.

ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా సర్వీ స్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లించడంతో కొ న్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి, రో డ్లు దెబ్బతినడం వల్ల వాహనదారు లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వి షయాన్ని జిల్లా ఎస్పీ గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగ కుండా తాత్కాలికంగా రోడ్డు మర మ్మతులు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లె క్టివ్ సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు ట్రాఫిక్ పోలీ సులను నియమించడం, అవసర మైన చోట్ల డైవర్షన్ మార్గాలను స్ప ష్టంగా సూచించడం, రాత్రి వేళల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాల ని సూచించారు. ముఖ్యంగా పండు గ రోజుల్లో ద్విచక్ర వాహనాలు,భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరిత గ తిన పూర్తయ్యేలా సంబంధిత రోడ్డు నిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్ట ర్లతో సమన్వయం చేసుకొని ప్రజల కు ఇబ్బందులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరిం చాలని కోరారు.

ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థా నాలకు చేరుకునే విధంగా జిల్లా పో లీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబ స్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేప డుతోందని జిల్లా ఈ సందర్భంగా తె లిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎ స్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మధుబాబు రోడ్డు సంబందిం చిన ఇంజనీర్లు తదితర అధికారు లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button