Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 5:28 am Posted by : praja deveena

SP Sharath Chandra Pawar : ఎస్పి శరత్ చంద్ర పవార్ కీలక వ్యా ఖ్య, హోంగార్డ్ లు పోలీసులతో స మానంగా సమర్థవంతమైన విధు లు నిర్వహిస్తున్నారు 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖలో అంతర్భాగ మైన హోంగార్డ్ సి బ్బంది పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో అను నిత్యం కష్టపడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూన్నారని, వారి సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పు డు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన ద ర్బార్ లో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్ష ణ లక్ష్యంగా 1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ప్రారంభమైన హోంగా ర్డ్ వ్యవస్థ నేడు పోలీసు శాఖలో భాగమై శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేర సంబంధిత విధుల నిర్వహణ వీరి పాత్ర ప్రశం సనీయమన్నారు.

హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం దృ ష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ వే తనాన్ని రూ. 921 నుండి రూ.10 00కి, అదే విధంగా పరేడ్ అలవె న్స్‌ను రూ. 100 నుండి రూ. 200కి పెంచడం, యూనిఫామ్ అలవెన్స్ 7 500 రూపాయలు,విధి నిర్వహణ లో మరణించిన సిబ్బందికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా లాంటి సంక్షేమా లు ఇవ్వడం జరిగిందని తెలియజే శారు.

సిబ్బంది ప్రతి ఒక్కరు తమకు అ ప్పగించిన విధులను క్రమశిక్షణతో, అంకిత భావంతో, బాధ్యతాయు తంగా నిర్వర్తించాలని అన్నారు. అ లాగే ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూయించాలని తెలిపారు. హోం గార్డ్ సంక్షేమానికి,సమస్యల పరి ష్కారానికి జిల్లా పోలీసు శాఖ ఎల్ల ప్పుడూ కట్టుబడి ఉంటుందని స్ప ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఎస్బి డిఎస్పి మల్లారెడ్డి, ఏ ఆర్ డిఎస్పి శ్రీనివాసులు, ఎస్బి సిఐ రాము,హోంగార్డ్ ఆర్.ఐ శ్రీను, అడ్మి న్ ఆర్.ఐ సంతోష్, యం.టి ఆర్.ఐ సూరపు నాయుడు, ఆర్.ఎస్ ఐ శ్రా వణి,హోమ్ గార్డ్ ఆఫీసర్స్ తదిత రులు పాల్గొన్నారు.