–డిసిసిబి జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు
Director Gudipati Saidulu : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి ప్రభుత్వాసుపత్రిలో వివిధ రకాల రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడం హర్షించదగ్గ విషయమని ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో దేశవ్యాప్త వైద్య ఆరోగ్య క్యాం పు ల నిర్వహణలో భాగంగా ఆసు పత్రి సూపర్డెంట్ నిర్మల్ కుమార్ అ ధ్యక్షతన నిర్వహించిన 8వ జాతీ య పోషణ మాస ప్రారంభ కార్య క్రమంలో పాల్గొని మాట్లాడారు.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ రకు తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ నందు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే వివిధ రకాల వ్యాధులకు సంబం ధించిన పేషెంట్స్ కు ఆయా వ్యాధు ల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండి వారికి వైద్య సదుపాయం అందిస్తారని తెలియజేశారు. ఆసు పత్రి సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కు మార్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పరీక్షలు. క్యాన్సర్ పరీక్షలు. నేత్ర ప రీక్షలు. రక్తపోటు పరీక్షలు. రక్తహీ నత పరీక్షలు, సికిల్ సెల్ ఎనీమి యా తో పాటు అన్ని రకాల రోగాల కు సంబంధించిన పరీక్షలు నిర్వ హించి రోగులకు తగు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందించే ఈ అవకాశా న్ని తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ పరిధి నందు ఉన్న వివిధ మండలా ల గ్రామాల ప్రజలు వినియోగించు కోవాలని కోరినారు. ఈ కార్యక్ర మం లో డాక్టర్ ఉపేందర్,డాక్టర్ మణిదీ ప్ డాక్టర్ వీణ,నర్సింగ్ సూపరిండెం ట్ అరుణ,హెడ్ నర్స్ సువర్ణ,న ర్సింగ్ ఆఫీసర్స్,పారా మెడికల్, స్టా ఫ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొ న్నారు.