Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srinivas Reddy : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ

— ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy :  ప్రజా దీవెన :   కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పైన సవతి తల్లి ప్రేమ చూపించారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాను సా రం నిర్వహించిన నిరసన కార్యక్ర మంలో సహచర దేవరకద్ర ఎమ్మె ల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి. మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుందని అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ , కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి, వివక్షపూరితమైన ధోరణి తో నిర్మల సీతారామన్ వ్యవహరించారని అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తం గా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

 

 

 

గతంలో నేను బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు , అప్పుడు పార్లమెంటు లో ఫ్లోర్ లీడర్ గా ఉన్న సుష్మా స్వరాజ్ తో ప్రభుత్వ బాలుర జూనియర్ కళా శాల మైదానంలో మీటింగ్ ఏర్పా టు చేశామని ఆ సందర్భంగా కేం ద్రంలో అధికారంలోకి వస్తే పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కానికి జాతీయ హోదా ఇస్తామని ఆమె ఎన్నికల ముందు చెప్పారని, అలాగే నరేంద్రమోడీ ఎంవిఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగి న సభలో నిధులు ఇస్తామని పాల మూరు గడ్డమీద మాట ఇచ్చారని, ఈ రోజుకు దాదాపు 11 సంవత్స రాలు గడుస్తున్నా సాక్షాత్తు ప్రధాన మంత్రి కూడా వారు ఇచ్చిన మాట ను తప్పారని ఆయన తెలిపారు.

 

హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 12 వరుసలతో గ్రీన్ ఫీల్డ్ లైన్ గా మారుస్తామని చెప్పి అందు కు కూడా నిధులు కేటాయిం చలేద ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్టులు అడుగుతున్నారని, వాటిని ఏవి పట్టించుకోకుండా, పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రత్యేకంగా ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి నిధుల గురించి ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారని, వినతిపత్రం ఇచ్చుకున్నారు కానీ బిజేపి ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పైన ఉన్న ప్రేమ ఈ రోజు తెలంగాణ పట్ల చూపించట్లేదని ఆయన విమర్శించారు. మన నిరసన సెగలు డిల్లీ లోని ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రికి తెలి యాలని ఆయన పిలుపునిచ్చా రు.

 

 

ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎన్ పి వెంకటేష్, జిల్లా కాంగ్రె స్ పార్టీ మహిళా అధ్య క్షురాలు వ సంత, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడి యా ఇంచార్జీ సిజె బెనహర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మల్లు న ర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చై ర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కు మార్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సా యి బాబా, ఐఎన్టీయుసి రాములు యాదవ్, జిల్లా మత్స్యకారుల సం ఘం అధ్యక్షులు గంజి ఆంజనే యులు, నాయకులు చలువగాలి రాఘవేందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, జహీ ర్ , ఫయాజ్, అవేజ్, రాజు గౌడ్, సంజీవ్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, ఇమ్రాన్ ఖురేషీ, ఫయీమ్, నవ నీత, సామ్యూల్ దాసరి, రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నా రు.