ప్రజా దీవెన, శ్రీశైలం: పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని, ఆది, సోమవా రా లు, ప్రభుత్వ సెలవు దినాలు మొదలైన రద్దీరోజులలో కూడా నిర్దిష్టవేళలలో శ్రీశైల మల్లన్న స్పర్శదర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం నిర్ణ యించింది. పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచ నలు దృష్టిలో పెట్టుకొని ఈ నెల 7వ తేదీన వైదిక కమిటి సభ్యులు, దేవస్థానం అన్నివిభాగాల యూని ట్ అధికారులు, పర్యవేక్షకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమా వేశంలో తీసుకొన్న నిర్ణయాన్ని అనుసరించి భక్తుల విజ్ఞప్తుల మేరకు శని,ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు రద్దీ రోజు లలో విడతల వారిగా శ్రీ స్వామి వారి అలంకార, స్పర్శదర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వ దర్శనం క్యూ లైన్లలోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడ తలలో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. గతంలో వలెనే ఈ స్పర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే పొందవలసి వుంటుంది. ఆన్ లైన్లో టికెట్ల లభ్యతను బట్టి గంట సమయం ముందు వరకు కూడా ఈ స్పర్శ దర్శనం టికెట్లను పొందవచ్చు. వీటిని కరెంటు బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదని దేవస్థానం ఈవో శ్రీనివా సరావు తెలిపారు. ఉదయం 7.30 ని, నుండి 9.30 గంటల వరకు, ఉదయం 11.45 నుండి మధ్యా హ్నం 1.30 గంటల వరకు, రాత్రి 8.30 నుండి రాత్రి 10.00 గంటల వరకు శ్రీ స్వామివారి స్పర్శదర్శ నంకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.