–సిఐటియు
CITU : ప్రజాదీవెన నల్గొండ : అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా ఉందామని కార్మిక వర్గ అంతర్జాతీయతను చాటుదామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణంలో క్యూబా సంఘీభావనిది విరాళాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు క్యూబా ప్రజలు ఉన్న పరిస్థితుల్లో అనేక రూపాల్లో అంతర్జాతీయ సంఘీభావం అవసరం ఎక్కువగా ఉన్నదని అన్నారు. క్యూబన్ విప్లవ సారధి కామ్రేడ్ ఫెడరల్ కాస్ట్రో శతజయంతి మరియు క్యూబా విప్లవ 66వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక, వస్తు రూపంలో సంఘీభావం తెలియజేయాలని భారతదేశంలోని నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా నిర్ణయించిందని అన్నారు.
ఆ కమిటీలో భాగస్వామిగా ఉన్న సిఐటియు కార్మిక సంస్థ అంతర్జాతీయతో పని చేస్తుందని అన్నారు. ప్రపంచంలో ఏ కార్మికుడు, ప్రజలు కష్టంలో ఉన్న వారికి అండగా సిఐటియు నిలబడుతుందని పేర్కొన్నారు. అందుకోసమే సిఐటియు క్యూబా సంఘీభావ నిధి విరాళాల సేకరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్యూబా పై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన 31 తీర్మానాలను అమెరికా తిరస్కరించిందని, క్యూబా వ్యతిరేక శక్తులకు టెర్రరిస్టులకు మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తూ క్యూబాను అస్థిరపరిచేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భారతదేశ ప్రభుత్వ రంగ పరిశ్రమల నాశనం వెనుక అమెరికా హస్తం ఉంది మన కార్మిక చట్టాలు అన్నింటిని రద్దుకు అమెరికా ఒత్తిడే కీలకమని అన్నారు అమెరికా వల్లే భారతీయ పరిశ్రమలెన్నో విలవిలలాడి మూతపడుతున్నాయని అందుకే మనకి ఎవరు శత్రువు క్యూబాకు కూడా ఆ అమెరికా శత్రువు అందుకని రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా క్యూబా సంఘీభావం నిధి విరాళాలు ఇచ్చి తమ అంతర్జాతీయతను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి, నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అవిరేషు మారయ్య, కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, కోశాధికారి వీరబాబు, టిఎస్పిసిఎల్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వెంకన్న, కోశాధికారి రామకృష్ణ, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కత్తుల యాదయ్య, కార్యదర్శి శంకర్, ఎలక్ట్రిసిటీ డిసిఎం డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు వేముల వెంకన్న , వివిధ సంఘాల నాయకులు సల్ల యాదయ్య, యాదగిరి రెడ్డి, చంద్రశేఖర్, లోడంగి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.