— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, పెద్దవూర: ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్న మండలాలలో ఈ నెల 10 నాటికి 50 శాతం పురోగతి వచ్చేలా చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇ లా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె పెద్దవూర ఎంపిడివో కార్యా లయంలో నాగార్జున సాగర్ నియో జకవర్గపరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై ఎంపిడివోలు,ఏ ఈ, ఏ పి ఎం, పం చాయతీ కార్యదర్శులతో సమీక్ష ని ర్వహించారు.
ఇల్లు మంజూరై నిర్మించుకోనెందుకు ఆర్థిక స్థితి లేని లబ్ధిదారుకు స్వ యం సహాయక మహిళా సంఘాల ద్వారా ఋణ సహాయం అందించి ఇల్లు నిర్మించుకునే విధంగా చర్య లు తీసుకోవాలని ఏపిఎంలను ఆ దేశించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబి తాలో పూర్తిగా అర్హులే ఉండాలన్నా రు.
అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని సంద ర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అంతేకాక పాఠశాల ఆవరణ, వంటగది, స్టార్ రూమ్ ను, పరిసరాలను, పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనం విద్య ను అందించాలని చెప్పారు. ఆ త ర్వాత ప్రాథమిక వైద్య ఆరోగ కేం ద్రాన్ని సందర్శించి ఓపి రిజిస్టర్, ఏ ఎన్ సి, పందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, ఎం పీడీవో లు,తహసిల్దార్ తదితరులు ఉన్నారు.