Students Youth Awareness Program: ప్రజా దీవెన, కోదాడ: పట్టణములోనిస్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి లో పాస్టర్ యునైటెడ్ పాస్టరే అసోసియేషన్ అధ్యక్షులు యేసయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్స్ యూత్ అవేరేనెస్ ప్రోగ్రాం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సహకార కళాశాల సీఈవో శ్రీనివాసరావు యలమర్తి చౌదరి పూర్ణ శశికాంత్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో యువతి యువకులు సోషల్ మీడియా ప్రభావము , స్నేహితులతో చెడు మార్గంలో నడుస్తూ ,మద్యము, డ్రగ్స్ మత్తు అలవాట్లకు బానిసలై యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాట విని సన్మార్గంలో నడిచి కష్టపడి చదువుకొని సమాజంలో మంచి గౌరవంగా జీవించాలని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు సదువుపై దృష్టి చారించి ఉన్నత శిఖరాల అధిరోహించాలని యువత ఆ వైపుగా ప్రయాణించాలని కోరారు .
ఇ కార్యక్రములో నడిగూడం మండలం మాజీ ఎం పి పి యాతుకుల జ్యోతి మధుబాబు, కోదాడ మున్సిపల్ మాజీ క్రిస్టియన్ కో అప్సషన్ సభ్యురాలు వంటెపాక జానకి, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు బొల్లికొండ కోటయ్య , శ్యామ్ బాబు, మేరమ్మ ,సీత ,శారా ,సునీత, సలోమి ,మోసెస్ ,రాంబాబు, ఎనోష్ , తదితరులు పాల్గొన్నారు.