District Collector Ila Tripathi : విద్యార్థులు.. చదువుతోపాటు శ్రమదానం కూడా అవసరం

--జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : విద్యార్థులు చదువుతోపాటు, మొక్కలు నాటడం శ్రమదానం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చదువు ఒక్కటే మార్గం...