Suicide: ప్రజా దీవెన వరంగల్: అక్కడా ఇక్కడా తేడా లేకుండా అంతటా అన్ లైన్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నే తాజాగా వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టిం గ్తో మరో యువకుడు బలి అ య్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టు కోవ డంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమార స్వామిల మూడవ కొడు కు చెందిన రాజు కుమార్ అయితే, డిగ్రీ పూర్తి చేసు కొని పోటీ పరీక్షల కు ప్రిపేర్ అవుతున్న అతడుఆన్ లైన్ బెట్టింగు అలవాటు పడ్డాడు. గత వారం రోజుల నుంచి 4 లక్షల రూపా యలు కావాలని తండ్రిని రాజు కుమార్ వేధిస్తున్నాడు.
అయితే, లైశెట్టి రాజు కుమార్ కు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో పలు మార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఉదయం ఇంటికి తాళం వేసి బయట కు వెళ్లిన తం డ్రి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు మనస్థాపనతో ఇంట్లో ఎవరూ లేకపోవ డంతో ఉరి వేసు కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక, తండ్రి ఇంటికి వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి కన్నీరుమున్నిరు అవుతున్నారు. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అం దించడంతో వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.