* సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి
Sundarayya Inspiration : ప్రజా దీవెన నాంపల్లి మే 20 : నాంపల్లి సిపిఎం మండల పార్టీ కార్యాలయంలో దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా, సిపిఎం నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరరామి రెడ్డి అసమానతలు లేని వర్గ రహిత సమాజం కోసం, తన యావదస్తిని వ్యవసాయ కార్మికులు దళితుల కోసం పంచి పెట్టి ఆదర్శంగా నిలిచారని అన్నారు. భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు, పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుతుందని దేశంలోని శ్రామిక అనగారిన వర్గాలే తమ పిల్లలుగా ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన నిస్వార్ధ ఆదర్శ దంపతులు అని అన్నారు వారి ఆశయాలు కొనసాగించడానికి ప్రతి ఒక్క పార్టీ సభ్యుడు కార్యకర్త కృషి చేయాలని నేటి యువతరం సుందరయ్య గారికి మనం ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, గడ్డం గురుమూర్తి గాదెపాక మధు, తేజ యాదయ్య,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు