Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sunita Williams: వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక పై అనుమానాలు?

–అంతరిక్ష యాత్ర కోసం వెళ్లి 3 నెలల క్రితం చిక్కుకున్న వైనం
–సునీతాను తిరిగి భూమిపైకి తీసు కువచ్చేందుకు నాసా అన్ని రకాల ప్రయత్నాలు

Sunita Williams: ప్రజా దీవెన, నాసా: ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) దాదాపు 3 నెలలుగా అక్కడే చిక్కుకున్నారు. అయితే సునీతా విలియ మ్స్‌ను తిరిగి భూమిపైకి తీసుకు వచ్చేందుకు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సునీతా విలియ మ్స్‌తోపాటు బుచ్ విల్‌మోర్ కూడా ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొన్నా రు. అయితే వీరిద్దరూ ఐఎస్ఎస్‌కు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌లో వెళ్లారు. ఆ స్టార్‌లై నర్ క్యాప్సూల్‌లో (Starly Ner Capsule)సాంకేతిక సమ స్యలు, హీలియం లీకేజీ కారణంగా వారి తిరుగుయాత్రకు ఆటంకం ఏర్పడింది. అయితే వారిని మరో వ్యోమనౌకలో తిరిగి భూమి మీదికి తీసుకురావాలని నాసా యోచి స్తోంది.

కానీ దానికి మరింత సమ యం పట్టే అవకాశాలు ఉన్నా యి. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు సమావేశమై నిర్ణయం తీసుకోనున్న ట్లు తాజాగా ప్రకటించింది. బోయిం గ్‌కు చెందిన స్టార్‌లైనర్‌లో సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ (Sunita Williams, Butch Willmore) ఈ ఏడాది జూన్‌ 5 వ తేదీన అంత ర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకు న్నారు. అయితే వారిద్దరూ వెళ్లిన వారం రోజుల్లోగా తిరిగిరావాల్సి ఉంది. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమం లోనే వారిని తీసుకురావడానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్ సురక్షి తంగా ఉందో లేదో ఈ శనివారం నిర్ణయిస్తామని గురువారం నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను (Sunita Williams, Butch Willmore) తిరిగి తీసుకురావ డానికి బోయింగ్ కొత్త క్యాప్సూల్‌ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ సహా ఇతర ఉన్నతా ధికారులు ఈ శనివారం బేటీ అయి చర్చించి నిర్ణయంతీసుకోనున్నారు.

సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మో ర్‌లతో (Sunita Williams, Butch Willmore) ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ అంతరిక్ష యాత్రలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తటం తో పాటు హీలియం వాయువు లీకేజీ కారణంగా సమస్య తలెత్తిం ది. దీంతో ఆ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌ లో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా గుర్తించింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందు కు ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఈ శనివారం ఆ స్టార్‌లైనర్‌ క్యాప్సూల్‌ ను పరీక్షించి అది సురక్షితం కాదని భావిస్తే ఖాళీగానే సెప్టెంబర్‌లో దాన్ని భూమి వైపు తీసుకురాను న్నారు. లేని పక్షంలో వారిద్దరినీ తీసుకువచ్చేందుకు నాసా ప్రత్యేకం గా స్పేస్‌ఎక్స్‌ క్యాప్సూల్‌ను పంపా ల్సి ఉంటుంది. కానీ అందుకోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యం లోనే వారు వెళ్లిన స్టార్‌లైనర్‌ థ్రస్టర్లను సరిచేసేందుకు కొత్త కం ప్యూటర్‌ మోడల్‌ను (A computer model)పరీక్షిస్తున్నట్లు నాసా ఇంజినీర్లు తెలిపారు. దాన్ని సమీక్షించిన తర్వాతే నాసా ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.