— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Neurological Disorders : ప్రజా దీవెన, నల్లగొండ: దివ్యాంగు లు, మానసిక వికలత్వంతో బాధప డే చిన్నారులు, రక్తహీనత ఇతర న రాల వ్యాధులతో బాధ పడేవారికి చికిత్స ద్వారా సహాయం చేసేందు కు ముందుకు రావాలని జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి ఈసీఐఎ ల్ చీఫ్ మె డికల్ ఆఫీసర్ తో కోరారు. గురువా రం ఈసీఐఎల్ కి చెందిన చీఫ్ మెడి కల్ ఆఫీసర్ వేణుబాబు, హెచ్ ఆర్ మేనేజర్ దుర్గా ప్రసాద్ లు జిల్లా కలె క్టర్ ను జిల్లా కలెక్టర్ చాంబర్ లో క లిసి సామాజిక బాధ్యత కింద ది వ్యాంగులకు బ్యాటరీ ఆపరే టెడ్ మోటార్ సైకిళ్ళు,కృత్రిమ అవయ వాలు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకీళ్ల వంటివి తాము పంపి ణీ చేస్తున్నామని, నల్గొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా లో సుమారు 52 వేల మంది విభి న్న సామర్ధ్యాలు (దివ్యాంగులు) క లిగిన వారు ఉన్నారని, ఇందులో గ తంలో ఫ్లోరైడ్ వ్యాధికి గురైన వారి తో పాటు, మానసిక వికలత్వం కలి గిన వారు,నరాల బలహీనత ఉన్న వారు,700 మంది చిన్నారులు మా నసిక వికలత్వంతో బాధపడుతు న్న వారు అలాగే కదలలేని పరిస్థితి లో మంచానికే పరిమితమైన వారు న్నారని తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ సైకిళ్ల తో పాటు, సీటీ స్కాన్, ఎంఆర్ స్కానింగ్ యం త్రాలు, అవసరమైన ఐఈసి మెటీరి యల్, అలాగే చికిత్సకు సంబంధిం చిన సహాయాన్ని చేయాలని కోరా రు. దేవరకొండ, మిర్యాలగూడ ల లో మారుమూల గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని , ఇక్కడి ప్ర జలు వైద్యానికై అటవీ ప్రాంతం నుండి దేవరకొండ ,మిర్యాలగూడ, నల్గొండ లకు రావాల్సిన వస్తున్న దని,లంబాడ ,చెంచు గూడెంలలో సహాయం అవసరం ఎక్కువగా ఉం టుందని తెలిపారు. ఎంతోమంది యుక్తవయసు బాలికలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తహీనతను తగ్గించేందుకు వారిని చైతన్యవంతులను చేసే విషయం లో ఐఈసి సామాగ్రిని అందిస్తే బా గుంటుందని చెప్పారు.
ఇందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వే ణుబాబు స్పందిస్తూ దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేకంగా ప్రతిపాద నలు రూపొందించి తమకు సమ ర్పించాలని, గతంలో ఇతర జిల్లాల లో రక్తహీనతను తగ్గించేందుకు తా ము కృషి చేశామని, బేస్ లైన్ సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ను సమర్పి స్తామని తెలిపారు. ఈ సమావేశం లో సిడిపిఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధి కారి నాగిరెడ్డి తదితరులు హాజర య్యారు.