Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court : జైళ్ళలో కులమతాలు సరికాదు.. అసలు ఖైదీలకు కులమేoటి..?

–కులం ఆధారంగా పని కేటాయిం చొద్దు
–మహారాష్ట వాసి పిటిష‌న్ దాఖ‌లు విచార‌ణలో సీజేఐ ధ‌ర్మాస‌నం

Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశం లోని జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు (prisoners)పనుల అప్పగింత, జైలు లో గదుల కేటాయింపునకు సంబం ధించిన నిబంధనలను తప్పుబట్టిం ది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధ నలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యం లోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సమానత్వ హక్కుకు వ్యతిరేకం కులం (CASTE) ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడు గు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్ర వర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్‌ 15ను అతిక్రమించ డమేన ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి పనులు విభజనకు దారి తీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అందరికీ పని విష యంలో సమాన హక్కు కల్పించా లని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించిం ది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీప ర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివ క్షకు సంబంధించిన కేసుల పరిష్కా రానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశిం చింది.

జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహా రాష్ట్రలోని కల్యాణ్​కు (KALYAN) చెందిన సుక న్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ (investigation) చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జన వరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ సహా 11 రాష్ట్రాల కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రా లు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదుల ను కేటాయిస్తు న్నట్లు పేర్కొన్నా యి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మా న్యువల్స్​లో ఉన్న ఇలాంటి అభ్యం తరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.