Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత అ త్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కో టాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండ రాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేయడం తెలంగాణ రాజ కీయాల్లో పెను సంచలనంగా నిలి చింది.
బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ల పిటిషన్‌లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కోదం డరాం, అలీఖాన్ ల నియామకం ర ద్దు చేస్తూ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోదండరాం, అలీ ఖాన్ లు తెలంగాణ గవర్నర్ కోటా శాసనమండలి సభ్యులుగా నియా మకమైన విషయం విధితమే. ఇది లా ఉండగా వీరి నియామకం అక్ర మంగా జరిగిందని దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలి పారు. గవర్నర్ వీరి వాదనను తిర స్కరించడంతో అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.
వారిద్దరి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయా లని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కో రారు. ఈ మేరకు బుధవారం విచా రణ జరిపిన అత్యున్నత న్యాయ స్థానం ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. అయితే తదుపరి విచారణను సె ప్టెంబర్ 17 వ తేదీకి వాయిదావే సింది.
.