Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court: న్యాయస్థానాలు మారితే న్యాయం మారుతుందా

–కవితకు బెయిల్‌ వ్యాఖ్యలపై పిటిషనర్ల ఐఏ దాఖలు
–రెండు వారాల్లో సమాధానం చె ప్పాలని సీఎంకు ఆదేశం

Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ‘‘కేసును విచారించే కోర్టు (Supreme Court)మారినా విషయం మారదు కదా అని సుప్రీంకోర్టు వ్యా ఖ్యానించింది. ఓటుకు నోటు కేసు ను మరో రాష్ట్రానికి బదిలీ చేయా లంటూ దాఖలైన వ్యాజ్యంపై అ త్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఓటుకు నోటు కేసు ను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ జనవరి 31న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జగదీశ్‌ రెడ్డి, కల్వకుంట్ల సంజ య్‌, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఆ పిటి షన్‌పై సోమవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభు త్వం తరపున ముకుల్‌ రోహత్గి, సిద్దార్థ లూథ్ర, మేనకా గురు స్వామీ పిటిషనర్ల తరఫున ఆర్య మ సుందరం, దామా శేషాద్రినా యుడు, మోహిత్‌రావు వాదనల ను వినిపించారు. తొలుత పిటిష నర్ల తరఫున ఆర్యమ సుందరం వాదనలను వినిపిస్తూ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా జరిగిన ప్రచారంపై ఇంటర్‌లోకేటరీ అప్లి కేషన్‌(ఐఏ) దాఖలు చేశామని, దానిని ఒకసారి పరిశీలించాలని కోరారు.

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా న్యాయవాదులు, న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేశారని వివరించారు. అందుకు సంబంధించిన ఫొటో కాపీలను ఐఏలో పొందుపరిచామని స్పష్టంచేశారు. ఐఏపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ ‘‘కోర్టులు, న్యా యమూర్తులను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారoటూ తెలం గాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాదుల ను ఉద్దేశించి ప్రశ్నించారు.ఓటుకు నోటు కేసులో (acse)నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి వద్దే హోం శాఖ ఉందని న్యాయవాది ఆర్యమ సుందరం మరో సారి ధర్మాసనం దృష్టికి తీసు కొచ్చారు. కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ సైతం హోంశాఖ పరిధిలోకి వస్తుందని, అధికారులు కూడా సీఎంకే నివేదించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ వాదనలపై ధర్మాస నం స్పందిస్తూ కేసును మరో రాష్ట్రా నికి బదిలీ (transfer) చేసినా అధికారులు మా త్రం ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టు కు నివేదిస్తారు కదా అని ప్రశ్నించింది.ప్రభుత్వం తరఫున న్యాయవాదులపై ధర్మాసనం మరో సారి అసంతృప్తిని వ్యక్తం చేసింది. న్యాయస్థానం, న్యాయవాదులపై బహిరంగంగా పోస్టులు చేశారంటూ అసహనం వ్యక్తం చేసింది. పిటిష నర్లు దాఖలు చేసిన ఐఏలోని పాయింట్లను ధర్మాసనం ప్రస్తా వించింది. ‘‘కబ్జాకోరులకు ఒక రూల్‌ సర్కారుకు ఒక రూల్‌ వాట్‌ ఈజ్‌ దిస్‌ అధ్యక్ష బెయిల్‌ వచ్చిందా ఇచ్చారా ఈ రెండింట్లో ఏది కరెక్టు?అంటూ సోషల్‌ మీడియాలో కాంగ్రె స్‌ (congress) చేసిన ప్రచారంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్ర కలుగజేసుకుని ఆ ప్రచారంలో రేవంత్‌ రెడ్డి పాత్రలేదని ధర్మాసనానికి తెలిపారు. పిటిషన్ల తరఫున న్యాయవాది ఆర్యమ సుందరం దానికి అభ్యంతరం తెలి పారు. ప్రస్తుతం టీపీసీసీకి అధ్యక్షు డిగా రేవంత్‌రెడ్డే ఉన్నారని, ఆ పార్టీ రాష్ట్ర అధికారిక సోషల్‌ మీడి యా చేసే ప్రచారానికి ఆయనదే బాధ్యత అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (Justice BR Gavai)స్పందిస్తూ ఐఏపై సమాధానం చెప్పాలని సీఎంను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.