Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court: రాష్ట్రాలకే రాయల్టీ హక్కు

–ఖనిజాలు, గనులు కలిగిన భూ ములపై ఆయా రాష్ట్రాలకుంటుంద ని సుప్రీం కోర్టు సుస్పష్టo
–ఆయా రాష్ట్రాలు రాయ‌ల్టీ విధిం చ‌డం తప్పు కాదని కీలక వ్యా ఖ్యలు
–రాయల్టీ, ట్యాక్స్ ఒకటి కాదని వెలువరించిన ధర్మాసనం తాజా తీర్పు
–రాయల్టీ విధించే విషయంలో సు ప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ

Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయ ల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉంద ని స్పష్టం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఖనిజాలు, గనులపై (On minerals and mines) రాష్ట్రాలు రాయల్టీ విధించే విష యంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రాయల్టీ విషయoలో ఈ మేరకు 8:1తో విస్తృత ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఖనిజాలు సమృ ద్ధిగా కలిగిన ఒడిశా, ఝార్ఖం డ్, పశ్చిమ్‌ బెంగాల్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ తీర్పు వల్ల ప్రయోజనం చేకూ రనుంది. ఇప్పుడు ఆ రాష్ట్రాలు తమ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సంస్థలపై అదనంగా మొత్తాన్ని వసూలు చేయడానికి వీలుకలగనుంది.

ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ (Chief Justice Justice DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం తాజా తీర్పు వెలువరిస్తూ రాయల్టీ, ట్యా క్స్ ఒకటి కాదని వ్యాఖ్యానించింది. అయితే తొమ్మిది మంది బెంచ్‌లో ఎనిమిది మంది ఒకే రకమైన తీర్పు ఇవ్వగా జస్టిస్ బీవీ నాగరత్న మా త్రం భిన్నమైన తీర్పు ఇచ్చారు. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్ల మెంటుకు గంప గుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్ట బెట్టలేదని గత విచారణలో సుప్రీం కోర్టు స్పష్టంచే సింది. రాష్ట్రాలకూ వాటిపై నియంత్రణాధికారం, అభి వృద్ధి హక్కులుంటాయని తేల్చి చెప్పింది. ఖనిజాల పై పార్లమెంటు కున్న పన్ను విధించే అధికారం అనే ది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మి ది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం-1957 (Mines, Mineral Development and Control Act) (ఎంఎండీఆర్‌) ప్రకారం ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారముందని మైనింగ్‌ కంపెనీల తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదించారు. దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1989 లో ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం కేసు లో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాయల్టీని పన్నుగా గు ర్తించవచ్చని తీర్పు చెప్పింది. అయి తే 2004లో పశ్చిమబెంగాల్‌ ప్రభు త్వం వర్సెస్‌ కేశోరాం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసు లో తీర్పు చెబుతూ 1989 నాటి తీర్పులో అచ్చుతప్పు లు దొర్లాయని, రాయల్టీ, పన్ను కాబోదని స్పష్టంచేసింది. దీంతో రెం డు విభిన్నమైన తీర్పులు రాగా అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు అప్పగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవ రిలో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మార్చిలో తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా సదరు కీలక తీర్పు వెలువరించింది.