Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court : సుప్రీం సంచలన నిర్ణయం, జడ్జిల ఆస్థుల వెల్లడించాలని సుస్పష్టం

Supreme Court : ప్రజా దీవెన, న్యూ డిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తం గా కలకలం సృష్టించిన జడ్జి ఇంటి లో నోట్ల కట్టలు బయటపడ్డ నేప ధ్యంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యా యమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యా ప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పై న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రకటన చేయడానికి ఇ ష్టం లేకపోతే కచ్చితంగా వైబ్‌సైట్‌ లో నైనా వెల్లడించాలని తెలిపింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు స మావేశంలో ఈ నిర్ణయం తీసుకు న్నట్లు స్పష్టం చేసింది. న్యాయపర మైన పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్న ట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు ఉన్నారు. వీరంతా ఆస్తుల వివరాలు వెల్లడించాలని తెలిపిం ది. ఈ నిర్ణయం భవిష్యత్‌లో వచ్చే న్యాయమూర్తులకు కూడా వర్తిస్తుం దని తెలిపింది.గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 1997 తీర్మానం ప్రకారం ఆస్తులను ప్రధాన న్యాయ మూర్తికి అందించాల్సి ఉండేది. అ యితే 2009 నిర్ణయం ప్రకారం కో ర్టు వెబ్‌సైట్‌లో స్వచ్ఛందంగా వెల్ల డించడానికి అనుమతి ఉన్నప్పటికీ న్యాయమూర్తుల మాత్రం అలా చే యడానికి ఇష్టపడలేదు. కానీ తా జా నిర్ణయంతో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులంతా సమిష్టిగా ఆస్తుల వి వరాలు బహిర్గతం చేయాలని నిర్ణ యం తీసుకున్నారు. జవాబుదారీ తనం కోసమే ఈ నిర్ణయం తీసుకు న్నట్లు చెప్పారు. అయితే ఆస్తుల వివరాలు సీజేఐకే ఇవ్వకపోయినా పబ్లిక్‌గా కూడా ప్రకటించుకునే అధి కారం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు న్యాయమూర్తులు ఆస్తులు వివరా లు ప్రకటించారు. ఇందులో న్యా యమూర్తుల్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జ స్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మ హేశ్వరి ఉన్నారు.