–సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమొద్దు
–వైద్యులు పని చేయకపోతే ప్రజా ఆరోగ్యకేనికే నష్టం
–చికిత్స అందక పేదలు పాడు తున్న పాట్లు చూడండి
–సమస్యలను శాంతియుతం పరిష్కిస్తాం, న్యాయం చేస్తాం
–దేశ వ్యాప్త వైద్యుల ఆందోళనలపై సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు
Supreme Court: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కోల్కోత వైద్యురాలు (Kolkata doctor)హత్యాచారం కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వైద్యులు విధు లకు హాజరుకావాలైందేనని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని, వెంటనే విదుల్లోకి రావాలని ఆదేశించింది. మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని సీజేఐ ధర్మాసనం నేడు స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార (Kolkata doctor) ఘట నపై సుప్రీంకోర్టు గురువారం విచార ణ చేపట్టింది. విచారణ జరువు తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సీబీఐ (cbi). సీల్ కవర్‌లో రిపోర్ట్‌ను అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో ప్రస్తా వించింది.ఇదిలావుండగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధులకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తు న్నామని వైద్య సంఘాలు తెలిపా యి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నా రని వెల్లడించాయి. దీనిపై స్పందిం చిన ధర్మాసనం తొలుత విధులకు హాజరుకావాలని సూచించింది. వైద్యులు పని చేయకపోతే ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని సూటిగా ప్రశ్నించింది.
ఆసుపత్రుల్లో (In hospitals) వసతులు ఏ విధంగా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమన్నారు సీజేఐ. గతంలో ఓసారి మిత్రుడ్ని చూడ్డానికి వెళ్లి ఓ రాత్రి అక్కడే పడుకున్నానని, అక్కడి పరిస్థి తులను కళ్లతో చూడాల్సి వచ్చిం దన్నారు.నేషనల్ టాస్క్‌ఫో ర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని ఆయా సంఘాలు కోరాయని అంటూ రెసిడెంట్ డాక్టర్ల (Resident doctors) సమస్యలను నేషనల్ టాస్క్‌ఫోర్స్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందన్నది డాక్టర్ల తరపు న్యాయవాదుల వెల్లడించారు. ఒక్కోసారి వైద్యుల డ్యూటీ 48 గంటల పాటు ఉంటుందన్నారు.ఈ స్థితిలో వైద్యుడి మానసిక, శారీరక (Mental and physical)స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనివేళలు, వర్కింగ్ కండిషన్‌పై ఎన్టీఎఫ్ దృష్టి సారిస్తుందన్నారు. ఎన్టీఎఫ్‌లో (NTF) ఉన్న వైద్యులు ఈ స్థితిని దాటి వచ్చినవారేనని, వర్కింగ్ కండిషన్స్, ఇతర సమస్యల గురించి తెలుసన్నారు.