Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శం అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ నేతృ త్వంలోని బెంచ్ సదరు కేసుపై గు రువారం విచారణ చేపట్టి ఈ మేర కు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో బిల్లుల ఆ మోదానికి గడువు విధింపుపై సు ప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గ వర్నర్లకు నిర్దిష్ట గడువు విధించ లే మని సుస్పష్టం చేసింది.
గడువు విధించడం అంటే అధికారా ల విభజనను తుంగలో తొక్కడమే నని అభిప్రాయపడింది. బిల్లుల వి షయంలో గవర్నర్ కు మూడు ఎం పికలు మాత్రమే ఉంటాయని స్ప ష్టం చేసింది. బిల్లు ఆమోదించడం, లేదా అసెంబ్లీకి తిరిగి పంపడం లే దా రాష్ట్రపతికి పంపటమనే మూ డు చాయిస్ లు మాత్రమే ఉంటా యని స్పష్టం చేసింది. ఇంతకు మిం చి నాలుగో అధికారం గవర్నర్ కు లే దని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు నాలుగో ఎంపిక లేదని కుండబద్ద లు కొట్టింది. బిల్లులను సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడం సరికాదని సీ జేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం అ భిప్రాయపడింది. పున:పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమా ఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది.