Suravaramsudhakarreddy : ప్రజాఉద్యమ సూరీడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి
--దేశ ప్రజల హక్కుల కోసం చట్టా లు చేయడంలో కీలక పాత్ర --సుధాకర్ రెడ్డి ఆశయాలు నేటిత రానికి ఆదర్శప్రాయం --శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి
Suravaramsudhakarreddy: ప్రజా దీవెన, నల్లగొండ: దేశ ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారం కో సం నిరంతరం అనేక పోరాటాలు ని ర్వహించిన ప్రజా ఉద్యమ సూరీడు కామ్రేడ్ సురవ రం సుధాకర్ రెడ్డి అ ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిపిఐ జాతీ య మాజీ ప్రధాన కార్యదర్శి నల్ల గొండ మాజీ ఎంపీ సురవరం సుధా కర్ రెడ్డి సంస్మరణ సభ దేవరకొండ రోడ్డులోని జిఎల్ గార్డెన్ లో బుధ వారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి వరా వు, సిపిఐ జాతీయ సమితి సభ్యు లు పల్లా వెంకట రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రం గారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎం ఎల్ సి నెల్లికంటి సత్యం లు కలసి సురవ రం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూ లమాలేసి ఘ నం గా నివాళులర్పిం చారు. సురవరం సుధాకర్ రెడ్డి మ రణానికి సంతాప సూచికంగా రెం డు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా శాసనమండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మా ట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి వి ద్యార్థి దశ నుంచి కమ్యూ నిస్టు భా వాలకు ఆకర్షితులై నల్లగొండ పార్ల మెంటు సభ్యులుగా రెండుసార్లు ప నిచేయడం జరిగిందని తాము ఇద్ద రం వేరువేరు పార్టీల నుండి పోటీ చేశామనీ కానీ ఏనాడు వ్యక్తిగత విమర్శ చేసుకోలేదని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ జిల్లా లకు సాగు, తగునీరు సాధించేం దుకు కమ్యూనిస్టులు చేసిన పోరా టంలో తాను ఎప్పుడు సంఘీభా వం తెలపడం జరిగిందని తెలిపా రు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ఆ ప్రాజె క్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తా మన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి మాట్లాడుతూ దేశంలో కార్మికుల, కర్షకుల సమ స్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో తన గళాన్ని విప్పిన గొప్ప కమ్యూ నిస్టు మేధావి సురవరం సుధాకర్ రెడ్డి అని అ న్నారు. కామ్రేడ్ అంటే వంద మం ది తో సమానమని ఒక్కడు ఉన్నా ఎర్రజెండాతో అన్యా యాన్ని ప్రశ్నిస్తారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు అంటే తనకు ఎంతో గౌరవం అని వారు చేసే పోరాటం, ఆరాటం ఎప్ప టికీ పద వుల కోసం కాదని పేద ప్రజ ల కోసమేనని పేర్కొన్నారు. బతి కు న్నంత కాలం ప్రజల కోసమే పనిచే సి చనిపోయిన తర్వాత కూడా వై ద్య విద్యార్థుల కోసం తన బాడీని ఇవ్వాలని కోరుకున్న గొప్ప నాయ కుడు సురవరం సుధాకర్ రెడ్డి అని గుర్తు చేశారు. నలగొండ జిల్లాకు చే సిన సేవలను గుర్తిస్తూ జిల్లా కేంద్రం లో ఆయన విగ్రహం నెలకొల్పడం తో పాటు ఓ మంచి కార్యక్రమానికి పేరు పెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
*ప్రజా ఉద్యమ దిక్సూచి….* ప్రజా జీవితంలో ఎన్నో ఉద్యమాల కు నేతృత్వం వహించి చారిత్రిక ఉ ద్యమ విజయాలను చవిచూ సిన సురవరం సుధాకర్ రెడ్డి ప్రజా ఉద్య మ దిక్సూచి అని సిపిఐ రాష్ట్ర కా ర్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూ నంనేని సాంబశివరావు తెలిపారు. విద్యార్థి దశ నుంచే ధిక్కార స్వరం తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సురవరం అంచలంచెలుగా ఎదిగి కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థాయికి చేరారని ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని ఆయన స్ఫూ ర్తి భవిష్యత్తు ఉద్యమానికి ప్రేరణ అ ని ఆయన తెలిపారు. సురవరం సు ధాకర్ రెడ్డి నిరంతర అధ్యయనశీలి అని అన్నారు. తన వాదన పటిమ తో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. కమ్యూనిస్టులు మ రణించి సైతం ప్రజల మదిలో జీవి స్తారని సుధాకర్ రెడ్డి అదే కొవకు చెందిన వారన్నారు.
*సురవరo జీవితం తెరిచిన పుస్తకo….* సురవరం సుధాకర్ రెడ్డి జీవితం మొత్తం తెరిచిన పుస్త కమని సిపిఐ జాతీయ సమితి స భ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంక టరెడ్డి అన్నారు. సురవరం ఓ ఆద ర్శవంతుడు, మేధావులలో మేధా వి, సామాన్య కార్యకర్తలలో ఓ కా ర్యకర్తగా ప్రతి ఒక్కరితో కలిసిపో యే మానవ తావాది అని కొనియా డారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యు లుగా ఆయన అనేక కుంభకోణా లను వెలుగులోకి తీసుకువచ్చార న్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం రూపకల్పన లో సురవరం సుధాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 2004లో తాను ఎమ్మెల్యేగా సుధాకర్ రెడ్డి ఎంపీగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ మహాసభలు నిర్వహించడం జరి గిందని, అదేవిదంగా సిపిఐ 100 సంవత్సరాల ప్రారంభోత్సవ సభ నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన సభకు సురవరం సుధాకర్ రెడ్డి పా ల్గొని ఉత్తేజపరిచిన ప్రసంగాన్ని ప్ర జలు మర్చిపోలేరని గుర్తు చేశారు.
*గొప్ప కమ్యూనిస్టు మేధావి…*…కమ్యూనిస్టు మేధావులలో తెలుగు తేజం సురవరం సుధాకర్ రెడ్డి ఒక్క రిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకం టి రంగారెడ్డి అన్నారు. దేశ ప్రజలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాల ని దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొని యాడారు. ఆయన ఆశయ సాధన కోసం ఎర్రజెండాలు కలిసి ఐక్య ఉ ద్యమాలు నడిపేందుకు సిద్ధం కావా లని పిలుపునిచ్చారు.
పేద ప్రజల హక్కుల కోసం జీవి తాంతం ప్రశ్నించే గొంతుక సుర వరం సుధాకర్ రెడ్డి మరణం అన్ని వర్గాల ప్రజలకు తీరంలోటని అన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాట కుటుంబం నుం చి వచ్చిన సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి యువజన కమ్యూనిస్టు ఉద్యమా లలో కీలక పాత్ర పోషించా రని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో సాగు తాగునీరు కోసం పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీ సిన ఉద్యమ నాయకుడని కొనియాడా రు.
ప్రశ్నించడం కమ్యూనిస్టుల ద్వారా నేర్చుకోవాలని నల్లగొండ పార్ల మెం ట్ సభ్యులుగా సురవరం సుధాకర్ రెడ్డి జిల్లా సమస్యలపై పార్లమెంట్ లో ప్రభుత్వాలకు ప్రశ్నల వర్షం కురి పించిన గొప్ప మేధావి అని డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో పోరాటంలో సిపిఐ కీలకపాత్ర పోషించిందని కమ్యూనిస్టుల డి మాండ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగ్ శ్రవణ్ కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే. శ్రీనివాస్, పల్లె నరసింహ, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరి రావు, పబ్బు వీరస్వామి, గురిజ రామ చంద్రం, బంటు వెంకటేశ్వర్లు బో ల్గురి నరసింహ, తిర్పారి వెంకటేశ్వ ర్లు, ఆర్. అంజ చారి, తూము బు చ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.