**లారీల కాంట్రాక్టర్ పై అగ్రహం
–తక్షణమే కాంట్రాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు..
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన కనగల్ 28 ఏప్రిల్ :కనగల్ మండలంలోని శేరి లింగోటం, చెట్ల చెన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా జిల్లా కలెక్టర్ శేరి లింగోటం లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనికి చేయగా అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు సరిగా రావటం లేదని తెలుసుకున్నారు. దీనిపై ఆమె కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కాంట్రాక్టర్ కు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని చెప్పారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే రికార్డుల నిర్వహణను సరిగా నిర్వహించాలని కూడా చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చెట్ల చెన్నారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ కూడా రికార్డులను సరిగా నిర్వహించకపోవడం పట్ల సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యవేక్షణ సైతం సరిగా లేదని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని,ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, డి సి ఓ పత్యా నాయక్ తదితరులు ఉన్నారు.