— సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Suryapet District Collector Tejas Nand Lal Pawar: ప్రజా దీవెన, సూర్యాపేట: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకమని నిరు ద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా రిటీ తదితర యువకులకు ఉపాధి కల్పన నిమిత్తం ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రభుత్వ సూ చించిన లక్ష్యాల ప్రకారం లబ్ధిదారు లకు ఎలాంటి ఆటంకం ఇబ్బందు లు లేకుండా రుణసదుపాయం క ల్పించాలని కలెక్టర్ తెజస్ కోరారు.
శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోనీ బ్యాంకర్స్ ,సంబంధిత అధికారు లు, జిల్లా అదనపు కలెక్టర్ పి రాం బాబుతో కలిసి సమావేశం నిర్వ హించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ద్వారా జిల్లాలో 60,502 దరఖాస్తు చేసుకున్నారని, దరఖా స్తు చేసుకున్న లబ్ధిదారులలో ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారుల కు లక్ష్యాల ప్రకారం రుణాలు అం దించాలని సూచించారు. దివ్యాం గులకు ఐదు శాతం అవకాశం క ల్పించాలని, ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో యువత స్వయం ఆ ర్థిక అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టిందని వారికి కావ లసిన సౌకర్యాలను అందించాలని తెలిపారు. రుణాలు అందించడం లో బ్యాంకర్లు లబ్ధిదారులకు సహ కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ డి ఎస్ సి కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్, డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు , డిటి డి ఓ శంకర్, డిఎండబ్ల్యూ ఓ జగదీశ్వర్ రెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఆర్ దినేష్ కుమార్, ఐఓబి బ్యాంకు మేనేజర్ వి నాగబాబు, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవి ,తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఎం సురేష్ ,కెనరా బ్యాంక్ మేనేజర్ ఎస్ కళ్యాణ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా రాజేష్, బ్యాంక్ ఆఫ్ మలేషి యా తిరుపతమ్మ, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.