District Collector Tejas Nand Lal Pawar : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కీలక వ్యా ఖ్య, సమాజనిర్మాణంలో ఉపాధ్యా యులదే కీలక పాత్ర
District Collector Tejas Nand Lal Pawar :
ప్రజాదీవెన, సూర్యాపేట: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ తే జస్ నంద్ లాల్ పవార్ అన్నారు. వి ద్యార్థులు దారి తప్పకుండా క్రమశి క్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యయులదే అన్నా రు. గురువారం సమీకృత జిల్లా అ ధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో జిల్లా కలెక్టర్ సమా వేశం నిర్వహించారు.
ప్రతి పాఠశాలలో అత్యవసర సంద ర్భాలలో తప్పించి సోమ, మంగళ వారాలు ఉపాధ్యాయులు తప్పని సరిగా నూరు శాతం హాజరు కావా లని అదేవిధంగా తక్కిన రోజుల్లో టీచర్ల హాజరు శాతం పెంచాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచేం దుకు ఉపాధ్యాయులు కృషి చే యాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 1 నుండి ప్రతి రోజు 9,10 త మరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలని, అదే విధంగా 6,7,8 తరగతుల విద్యార్థు లకు “ప్రగతి గ్రూప్స్” పేరిట అదన పు తరగతులు నిర్వహించాలని ఆ దేశించారు.ప్రతి పాఠశాలలో, ప్రతి విద్యార్థి నెలలో పది రోజులు తెలు గు చదవాలని (పఠనోత్సవం), మ రో పది రోజులు చూసి మంచిగా రా యాలని, చివరి పది రోజులు బేసిక్ మాథ్స్ చేసే విధంగా ప్రణాళికలు సి ద్ధం చేయాలని ఆదేశింస్తూ వీటిలో ప్రతిభ చూపెట్టిన విద్యార్థులను బ హుమతులు ఇచ్చి ప్రోత్సాహించేం దుకు ప్రతి కాంప్లెక్స్ హెడ్ మాస్టారు కి రూ. 3వేలు కలెక్టర్ మంజూరు చే శారు.
కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు నెలలో 15 పాఠశాలలు తనిఖీ చేయాలని, తని ఖీలు చేసినప్పుడు ఎఫ్ ఎల్ యన్, ఎల్ ఐ పి లపై, అలాగే విద్యార్థులచే తెలుగు, ఇంగ్లీష్ చదివించాలని, ప దవ తరగతి విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ తదితర అం శాలపై సమీక్ష నిర్వహించాలని సూ చించారు.9,10 తరగతుల విద్యా ర్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి గరిష్టంగా ప్రతి విద్యార్థి 90% మార్కులు, కనిష్టంగా 70 శా తం మార్కులు సాధించే విధంగా ప్ర ణాళికలు సిద్ధం చేశామని, దీనికి మీ వంతు సహకారంగా పిల్లలను ఇంటి వద్ద బాగా చదివిపించేలా చూడాలని వారికి తెలియజేయాల ని సూచించారు.
ఎక్కడైనా అదనపు నోట్ బుక్స్, పా ఠ్యపుస్తకాలు అవసరం ఉంటే తమ కు తెలియజేయాలని, అదేవిధంగా రెండో జత యూనిఫామ్ మహిళా సంఘాలకు కుట్టడానికి ఇవ్వడం జ రిగిందని, కుట్టటం పూర్తయిన చోట వెంటనే విద్యార్థులకు అందించా లని సూచించారు. తాను సంద ర్శిం చిన పాఠశాలలో ఐఎఫ్ పి ప్యానల్ ఉపయోగించిన పాఠశాలలో విద్యా బోధన బాగుందని, ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ లో ఒకాబులరీ లో భాగంగా ముందుగా కీలక పదాలు నేర్పించా లని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న భవనాలను గు ర్తించి వాటిని ఖాళీ చేపించి వేరే భ వనంలో పాఠశాలలు నిర్వహించా లని, ఎక్కడైనా టాయిలెట్స్ అవస రం ఉంచే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తామని, ఎకో క్లబ్స్ లో భాగంగా పాఠశాల ఆవరణలో మొ క్కలు నాటాలని అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్ధన్,శ్రావణ్ కు మార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈ వోలు,కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధి కారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.