District Collector Tejas Nand : ప్రజాదీవెన, సూర్యాపేట: ఇందిర మ్మ ఇండ్లను నాణ్యత ప్రమాణాల తో నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చెప్పారు.మంగళవారం ఆయన చివ్వేముల మండలం, గుంపుల తిరుమలగిరి లో పందిరి నవ్య నిర్మించుకుంటు న్న ఇందిరమ్మ ఇల్లును పరిశీలించా రు.
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితమైన కొలతలతో, ప్రభుత్వం నిర్దేశించిన స్థలములోనే నిర్మించు కోవాలని, స్థానిక మేస్త్రీల తో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, ముందు గా అగ్రిమెంట్ చేసుకోవాలని, ఇంది రమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇ వ్వడం జరుగుతుందని, దానిని స ద్వినియోగం చేసుకొని త్వరగా ఇం టి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుంపుల తిరుమలగిరి లోని ఉన్న త పాఠశాలను, ప్రాథమిక పాఠశా లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తొమ్మిదవ తరగతికి వెళ్లి వి ద్యా ర్థులతో తెలుగు చదివించారు.ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని, అప్పు డే మంచి ఫలితం వస్తుందని, కష్ట పడే మనస్తత్వాన్ని విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకోవాలని ఆ యన విద్యార్థులకు సూచించారు.
కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉం టుందని, ఎంత కష్టపడి చదివితే, మనకు అంత ప్రతిఫలం వస్తుందని కావున ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అ ధిరోహించి, తల్లిదండ్రులకు, పా ఠ శాలకు మంచి పేరు తీసుకుని రా వాలని అన్నారు.
ప్రైమరీ స్కూల్ లో 4,5 తరగతుల కు వెళ్లి విద్యార్థులతో ఎక్కాలు చ దివించారు, ఇంగ్లీషు, లెక్కలు చే యించారు.పిల్లలు బాగా చదివడం పై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వంట గదిని పరిశీలించారు. వంట గదిలో వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలని, పరిశుభ్రత పాటిం చాలని కలెక్టర్ అన్నారు. తహ సి ల్దార్ సంతోష్, ఎంపీడీవో ప్రకాష్ రా వు, , ఎంఈఓ కళా రాణి, హెడ్మా స్టర్ బి. శైలజ, హౌసింగ్ ఏఈ ప్రే మలత, పంచాయతీ సెక్రెటరీ పాల్గొ న్నారు.