— మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి
Suryapet MLA Jagadish Reddy: ప్రజా దీవెన, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర జల విధానంలో రాష్ట్ర ప్రభుత్వo ప్రణాళిక లేకుండా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగ దీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూర్యా పేట జిల్లా కేంద్రంలో ఆయన మీ డియాతో మాట్లాడారు. రాష్ట్రం లో ని కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి ప్రణా ళికతో పాటు జల విధానం అంటేనే తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నీళ్లు ఇవ్వాలన్నా కనీస సోయి ధ్యాసా లేకుండా పోతోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పారు. డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసుకున్న సీఎంకి కమిషన్ల తో కాలం వెల్లదీ స్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో 20 శాతం కమిషన్లు దండుకుం టున్నారని, స్వయంగా సచివాల యంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తు న్నారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అర్పించారు.
BRS nalgonda ex minister jagadeesh reddy fires on congress pic.twitter.com/oMZp43wan9
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 8, 2025
కాంగ్రెస్ వచ్చింది కరు వు వచ్చింది అని ప్రజలు చర్చించు కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్ర జలు ఆగ్రహంగా వున్నారని, ఇప్ప టికైనా ప్రభుత్వం బుద్ది తెచ్చుకో వాలని, తెలంగాణ లో కమీషన్ల దందా ఆపాలని, పెద్ద పెద్ద కాంట్రా క్టర్లులకు మాత్రమే బిల్లులు చెల్లి స్తున్నారని ధ్వజమెత్తారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసు కునే దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో కాంట్రాక్టర్ల ఆందోళన పై ఆర్ధిక మం త్రి సమాధానం చెప్పాలని, శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. కాంట్రాక్టర్ల బిల్లు విష యంలో వచ్చే అసెంబ్లీ సమావేశా ల్లో లేవనెత్తుతామని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయ కుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదని, గోదావరి కృష్ణా లా ల్లో సరిపడా నీళ్లు వున్నా ఇవ్వడం చేతకావడం లేదని, పాలకులకు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతు న్నాయో కనీస అవగాహన లేకపో వడం దురదృష్టకరమన్నారు.
రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా పోతోందని, కరంట్ కూడా సరిగా ఇవ్వడం లేదని, 2014 కం టే ముందు ఉన్న పరిస్థితిలు పున రావృతమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీ కొర కు కాళేశ్వరం లిఫ్ట్ లను నడపడం లేదని, గోదావరి నీళ్లు తీసుకుపో తాం అని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎంలో కించింతు చలనం లేదని, తెలంగాణ మం త్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.