–పూచీకత్తు నగదు జప్తు చేసిన నూతనకల్ పోలీసులు
–ఇద్దరు నిందితుల లక్షలు ప్రభుత్వ ఖాతాలో జమ
— సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
Suryapet District SP Narasimha: ప్రజాదీవెన, సూర్యాపేట: అలవా టుగా నేరాలకు పాల్పడే వారిని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని, శాంతి భద్రతలకు విభాగతం కలిగించే వారిని, సస్పెక్ట్ షీటర్స్ ను, రౌడి సీటర్స్ ను సమ స్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని మళ్లీ నేరాలు చేయకుండా ఉండాలనే సదుద్దేశంతో, వారు సత్ప్రవర్తనగా ఉండడానికి గాను మండల మెజిస్ట్రేట్ వద్ద 6 నెలలు లేదా సంవత్సర కాలానికి పూచికత్తుతో బైoడోవర్ చేయబడం జరుగుతుంది అని, పౌరుల సత్ప్రవర్తన కోసం పోలీస్ శాఖ బైండోవర్ అనే నిబంధనను అమలు చేస్తుంది అని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించి బైండోవర్ కాల పరిమితిలో ఉండి మళ్లీ నేరానికి పాల్పడినట్లయితే అలాంటి వారు బైండోవర్ సమయంలో ఎంత మొత్తానికి (రూ..) పూచికత్తులు చేయబడుతారో ఆ డబ్బును మండల మెజిస్ట్రేట్ MRO ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఖాతా నందు జమ చేయడం జరుగుతుంది అన్నారు.
గత మార్చి నెలలో మిర్యాల గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితులైన A1 కనకటి వెంకన్న @ వెంకటేశ్వర్లు, A2 కనకటి శ్రావణ్ వీరిద్దరూ ఈ హత్య జరగడానికి ముందు గ్రామంలో ఉన్న తగాదాల విషయమై 9 నెలల క్రితం 1 సంవత్సర కాలానికి నూతనకల్ ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేయడం జరిగినది. వీరు ఇద్దరూ బైండోవర్ కాలపరిమితి ఉండగానే హత్యా నేరానికి పాల్పడ్డారు, బైండోవర్ నిబంధనల ప్రకారం వీరు ఒక్కొక్కరు రూ. 1 లక్ష రూపాయలకు పూచికత్తులు ఉన్నారు, ఈ నిబంధనల ప్రకారం ఎమ్మార్వో గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇద్దరు నిందితులచే ప్రభుత్వ ఖాతా నందు ఒక్కొక్కరికి రూ.1 లక్ష రూపాయలు చొప్పున జమ చేయించడం జరిగినది అని ఎస్పిగారు తెలిపినారు. ఈ ఇద్దరు హత్య కేసులో ప్రధాన నిందితులు ప్రస్తుతం పీడి యాక్ట్ నమోదు చేయబడి సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.
బైండోవర్ నిబంధన ఉల్లంఘించేది ఎంతటి వారైనా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బైండోవర్ నగదును జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా హెచ్చరించారు.