Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక వ్యాఖ్య, పౌరులంతా యూనిఫామ్ లేని పోలీసులేనని భావించాలి

Suryapet SP Narasimha : ప్రజా దీవెన,కోదాడ : రౌడీ షీటర్లు గంజాయి సేవించేవారు అమ్మక రవాణా దారులు అసాంఘిక కా ర్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకొని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించా లని జిల్లా ఎస్పీ నరసింహ హితవు పలికారు. బుధవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో యువత కు నిర్వహించిన కౌన్సిలింగ్ అవగాహ న సదస్సుకు ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు.

యువత తాత్కాలిక సుఖం కోసం చెడు అలవాట్లకు లోనై కుటుంబ స భ్యులను ఇబ్బంది పెడుతూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలిసి తెలియక చేసి న తప్పులను సరిదిద్దేందుకు తామి చ్చే అవకాశాన్ని సద్వినియోగం చే సుకోవాలన్నారు. రెండోసారి నేరం చేస్తే అనివార్యంగా పీడియాక్టివ్ కేసును బనయించాల్సి వస్తుందని హెచ్చరించారు.

సమాజ శాంతి భద్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. మాదకద్రవ్యాలకు అలవాటై భార్యా పిల్లలను వదిలివేస్తే వారి బతుకు లు ఎలా ఉంటాయో అవగతం చే సుకొని మంచి పౌరులుగా మారా లని ఉదాహరణలతో వివరించా రు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగు తున్నాయని ఆధార్ కార్డు నెంబర్ గాని బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ గాని ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవ రికి చెప్పవద్దన్నారు. తెల్లారే కల్లా లక్షలు రూపాయలు సంపాదించుకో వచ్చని ఆన్లైన్ లో వ్యాపారం చేసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘట నలను ఆయన వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలన్నారు.

లక్కీ డ్రా అలాంటి మోసాలపై అప్ర మత్తగా ఉండాలన్నారు. ప్రతి పౌ రు డు యూనిఫామ్ లేని పోలీసేనని అపరిచిత వ్యక్తులు తారసపడితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలి యజేయాలన్నారు. సమాజ శాంతి భద్రతలలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని కోరారు. వినాయ క చవితి దసరా దీపావళితోపాటు పాటు అన్ని మతాలకు చెందిన పం డుగలను వివాదాలకు తావు లేకుం డా పరస్పర గౌరవంతో జరుపుకోవా లని సూచించారు.

అవగాహన సదస్సు కు అధ్యక్షత వ హించిన కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రె డ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో నే రాలు చేయమని మంచి ప్రవర్తన క లిగి ఉంటామని ప్రతిజ్ఞ చేయించా రు. అవగాహన సదస్సులో సిఐలు చరమందరాజు ప్రతాప లింగం శివ శంకర్ నాయక్ ఎస్ఐలు పాల్గొన్నా రు.