Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ ఉద్బో ధ, ప్రతి విద్యార్థికి మంచి ఆశయం, లక్ష్యం ఉండాలి

–ప్రావీణ్యం ఉన్న అంశం పై సాధన చేయాలి

–చెడు అలవాట్లకు, చెడు వ్యక్తుల కు దూరంగా ఉండాలి

–డ్రగ్స్, సైబర్ మోసాల నివారణలో ఇతరులకు అవగాహన కల్పించాలి

SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రతి వి ద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని, అబ్దుల్ కలాoని స్ఫూ ర్తిగా తీసుకోవడం ద్వారా ఆశయ సాధన కోసం కృషి చేస్తేనే విజయా లు వరిస్తాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విద్యార్ధులకు ఉ ద్బోధించారు. పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుం చుకోవాలని, చదువు చాలా విలువై నది ప్రపంచంలో చదువుతోనే వి జ్ఞానం వెలుగోందుతుందన్నారు.

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా బుధవారం సూర్యా పే ట పట్టణం నందు ప్రభుత్వ జూని యర్ కళాశాలలో పోలీస్ ప్రజాభరో సా అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శాం తి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవ ర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు, ప ట్టుదలతో కృషి చేయడం, విజయా లు అoశాల గురించి అవగాహన క లిగించారు.

ఈ సందర్భంగా కోదాడ డిఎస్పీ మాట్లాడుతూ భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి పురష్కరించుకుని ఆయన జీవితం గురించి కలాం సాధించిన విజయా లు, అతను దేశానికి చేసిన సేవ, కృ షి గురించి విద్యార్థులకు వివరించా రు. మనకు విజ్ఞానాన్ని, తెలివిని, మంచి నడవడికను విద్యాలయా లు నేర్పిస్తాయని, విద్యార్థికి తరగ తి గది ఒక ప్రయోగశాల అని పేర్కొ న్నారు.

బాగా చదివి ప్రయోజకులు కావాలి, సదుపాయాలను సద్వినియోగం చే సుకుని లక్ష్యం కోసం నిరంతరం కృ షి చేయాలన్నారు. అవకాశాలు లే ని రోజుల్లో మంచి విజయాలు సా దించిన గొప్పవాళ్ళు ఉన్నారని, అ లాంటి వారి విజయగధాలను ఆద ర్శంగా తీసుకోవాలన్నారు. బాలిక లు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలన్నారు, సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి వాటి నిర్మూ లనకు చదువు మార్గమన్నారు. ప్రా వీణ్యం ఉన్న అంశంలో కృషి చేయా లి, ఆటలు ఆడాలి, శారీరకంగా దృ ఢంగా ఉండాలని కోరారు. భేటీ బ చావో – భేటీ పడావో నినాదంతో బా లికల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయి, బాలికలను ఎదగ నివ్వాలని కోరారు. బాల్య వివాహా లు చేయవద్దు అని కోరారు.

విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు ఒత్తి డికి లోనై, ఆకర్షణలకు లోనై బంగారు జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు అని కోరారు. చెడు అలవాట్లకు లోను కావద్దు మంచి పుస్తకాలను మంచి స్నేహి తులను ఏర్పాటు చేసుకోవాలి, కష్టపడి చదివి తల్లిదండ్రులకు చ దువు చెప్పిన గురువులకు పాఠ శాలకు మంచి పేరు తేవాలని కోరా రు. ఏ రకంగా నైనా వేధింపులు జ రుగుతున్న తెలిసినవాళ్లు బంధువు లు ఎవరైనా చెడు బుద్ధితో శరీరా న్ని తాకుతున్నట్లు గ్రహించిన వెంట నే తల్లిదండ్రులకు లేదా గురువుల కు తెలియజేయాలి, ధైర్యంగా పోలీ సులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ప్రస్తుత సమాజంలో సైబర్ మోసా లు మాదకద్రవ్యాలు అతిపెద్ద సమ స్యగా ఉన్నాయని వీటిపై విద్యార్థు లు ఫ్రంట్ వారియర్స్ లాగా పనిచేసే పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాజిక మాధ్య మాలలో వచ్చే వాటికి ప్రభావితం కావొద్దు అని ఇంటర్నెట్ నుంచి జ్ఞా న సముపార్జనకు సద్వినియోగం చే సుకోవాలని కోరారు.ఈ కార్య క్ర మంలో సూర్యాపేట పట్టణ సీఐ వెం కటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు, కళాశాల అ ధ్యాపకులు పాల్గొన్నారు.