Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

pm modi: సుస్థిరతకే ప్రజల పెద్దపీట

–సదరు సందేశాన్ని ఎన్నికల ఫలి తాలు వెల్లడించాయి
–ఎన్డీఎ విజయంతో మూడో మారు అధికారం
–అసెంబ్లీ ఎన్నికల తరవాత కాశ్మీర్ కు రాష్ట్ర హోదా
–కాశ్మీర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

pm modi: ‘సుస్థిరత’కే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థి రతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (pm modi) అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలో కి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందన్నారు.

ప్రజా దీవెన, కాశ్మీర్ : జమ్మూకశ్మీర్ కు (Jammu and Kashmir) త్వరలోనే తిరిగి రాష్ట్ర హోదా కల్పించుకుందామనే సంకేతాలిస్తూ, అసెంబ్లీ ఎన్నికల ద్వారా కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయం ఎంతో దూరంలో లేదని ప్రధాన మంత్రి మోదీ (Prime Minister Modi) వ్యాఖ్యానించా రు .ప్రపంచ యోగా దినోత్సవంసందర్భంగా శ్రీనగర్ లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవా రం నాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఫలితాలుచూపెట్టిందని, పనితీరు ఆధారంగానే ప్రజలు 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. తమకంటే ముందు అధి కారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రస్తా విస్తూ, గత శతాబ్దంలోని చివరి దశాబ్దంలో అస్థిర ప్రభుత్వాలను చూశామనీ, పదేళ్లలో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయని అన్నారు. ఎన్నికలకే దేశం పరిమితమైందే కానీ ఎలాంటి ప్రగతి సాధించలేక పోయిందన్నారు. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి సమయంలో ఇండియా ను ముందుకు తీసుకువెళ్లేందుకు తాము పగ్గాలు చేపట్టామని, పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని
చెప్పారు. ఇదంతా గతమని, ఇప్పు డు ఇండియా సుస్థిర ప్రభుత్వ శకం లోకి అడుగుపెట్టిందని, ప్రజాస్వా మ్యం మరింత పటిష్టమైందని అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతలో జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) పాత్ర కీలకమని చెప్పారు.

మానవత్వం ప్రజాస్వా మ్యం, కశ్మీరియత్ కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కన్నకలలు సాకారం కానున్నాయని అన్నారు. ఈ ఎన్నికలతో జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) ప్రజలు స్థానిక ప్రజాప్రతి నిధులను ఎన్నుకోవడం, తద్వారా తమ సమస్యలను పరిష్కరించు కోవడం జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సన్నాహకాలు సైతం జరుగుతున్నాయని చెప్పా రు. రూ.1,500 కోట్ల విలువచేసే 84 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను గురువారం ప్రారంభించనున్నట్టు కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.1,800 కోట్లతో వ్యవసాయరంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రారంభించ నున్నా మని, కొత్త జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు నిర్మించనున్నామని చెప్పారు. గత పదేళ్లలో కశ్మీర్ స్టార్టప్లు, స్కిల్ డవలప్మెంట్, క్రీడల్లో ముందుకు దూసుకెళ్లేందని, పాలి టెక్నిక్ సీట్లు పెరిగాయని, న్యూ స్కిల్స్కు అవకాశాలు పెరగాయని, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ నిర్మా ణాలతో పాటు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా జరు గుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో శాంతి స్థాపనకు అవరోధం కలిగిచే టెర్రరిస్టులకు గుణపాఠం చెప్పేందుకు తమ ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు.