SHG health security: ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలం గాణ రాష్ట్రంలోని స్వయం సహా యక మహిళా సంఘాల సభ్యుల కు ప్రభు త్వం ఆరోగ్య భద్రత కల్పి స్తుందని ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూ ఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కా ర్డు జారీ చేసే విధానం అమలు లోకి తేవాలని అధికారులకు సూ చించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివ రాలతో కూడిన డేటా బేస్ త యారు చేసి అందరికీ ఆరోగ్య పరీ క్షలు చేయించాలని చెప్పారు.వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ము ఖ్య మంత్రి “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. కార్య క్రమం ఆవరణలో స్వయం సహా యక సంఘాల మహిళల ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మహిళా సంఘా లతో కలిసి పనిచేయడానికి సం బంధించి వివిధ సంస్థలకు మ ధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద ప త్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి , చే సిన ప్రసంగం ఆయన మాటల్లో నే…“రాష్ట్రంలో మహిళలను ప్రో త్సహించాలి. వారిని ఆర్థికంగాని లబెట్టాలి. ఆర్థికక్రమ శిక్షణతో ముం దుకు వెళుతున్నారు. గడిచిన ఎ న్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వ యం సహాయక సంఘాలను ఆ ర్థి కంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్ర భుత్వం రాష్ట్రంలో కోటి మంది మ హిళలను కోటీశ్వరులను చేయాల ని సంకల్పించింది.
తెలంగాణ, వన్ ట్రిలియన్ ఎకాన మీ లక్ష్యం సాధంచాలంటే రాష్ట్రం లో కోటి మంది మహిళలు కోటీశ్వ రులు కావాలి. ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మ హాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉ చిత ప్రయాణ సౌకర్యం కల్పించ డం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు 5 వేల రూపాయల మేర కు ఆదా అయింది. ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టింది. ఆర్టీసీ ద్వా రా నడుపుకోవడానికి మహిళా గ్రూ పులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించాం. 600 బస్సులను వెంటనే తీసుకుని నడిపించాలి. అవసరమైతే భవిష్యత్తులో మరి న్ని కేటాయిస్తాం.
రూ. 500 లకే సిలిండర్, పాఠశాల ల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. పాఠాశాలల్లో విద్యా ర్థినీ విద్యార్థులకు 1 కోటి 30 లక్షల యూనిఫామ్ డ్రెస్సుల బాధ్యత కూ డా వారికే అప్పగించాం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వ హించే వ్యాపారాల్లో సైతం మహి ళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం.
ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రో త్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నాం. ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సం ఘా ల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసు కునే సౌలభ్యం కల్పించాం. ఇలా ప్ర తి చోటా, ప్రతి సందర్భంలోనూ మ హిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తు న్నాం. మహిళా శక్తిని ప్రోత్సహించ డమే ప్రభుత్వ లక్ష్యం. గతేడాది 20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థి క క్రమశిక్షణతో తిరిగి చెల్లించారు.
స్వయం సహాయక సంఘాల (SH G సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కా ర్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కా ర్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ముఖ్యంగా మహి ళ లకు అవసరమైన హెల్త్ చెకప్ చే యించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయా రు చేయించడం, ఆరోగ్యం దెబ్బతి న్న తర్వాత సహాయం అందించ డం కాదు. వైద్య పరీక్షలు నిర్వహిం చడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మ హిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలు వ్యా పారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కు టుంబాలు ఆర్థికంగా నిలబడుతా యి. 1967 లో చైనాతో, 1971 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సం దర్బంగా ఇందిరా గాంధీ l మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుంది” అని సమావేశాన్ని ఉద్దేశించి ము ఖ్యమంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి, వీహబ్ ప్రతినిధులు, వివిధ సంస్థ లు, మహిళా సంఘాల ప్రతినిధు లు పాల్గొన్నారు.