–కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
Collector Tejas Nandlal Pawar : ప్రజా దీవెన, సూర్యాపేట:ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం వచ్చే విధంగా టీచర్లు కా ర్యాచరణ సిద్ధం చేసుకోవాలని జి ల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవా ర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరే ట్ లోని సమావేశం మందిరంలో ప్ర భుత్వ జూనియర్ కళాశాల, మోడ ల్ స్కూల్స్, వెల్ఫేర్ కళాశాలలు, కే జీబివి లకు సంబంధించిన ప్రిన్సిపా ల్స్ తో ఇంటర్మీడియట్ మొదటి, రెండు సంవత్సరాల అకాడమీక్ సం బంధించి సమావేశం నిర్వహించా రు.
ప్రభుత్వ కళాశాలల మీద నమ్మ కంతో విద్యార్థులు వస్తున్నారని వారికి అర్థమయ్యేలా బోధించి భ విష్యత్తులో ఉన్నత శిఖరాలను చే రుకునేలా అందరం కలిసి వారిని తీర్చిదిద్దాలని సూచించారు. ప్రభు త్వ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంటుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో సమావేశం నిర్వ హించి ప్రతి సబ్జెక్టు టీచర్ వారితో మాట్లాడాలని వారి పిల్లలు ప్రతి రో జు కళాశాలకు వచ్చేలా చూడాలని 1,2 టెస్టులకు సంబంధించి ఫలితా లు తెలియజేయాలని అలాగే ఇంటి వద్ద కూడా చదివిపించాలని తల్లి దండ్రులకు సూచించాలని తెలి పా రు.
ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధిస్తారు కాబట్టి వారికి చదువుకుంటే కలిగే ప్రయోజ నాలు,కెరియర్ పై మోటివేషనల్ క్లా స్ లు తీసుకోని ప్రోత్సహించాలని సూచించారు. ఖాన్ అకాడమి, ఫి జిక్స్ వాలా లాంటి వాటిని విద్యా ర్థులు ఉపయోగించి పోటీ పరీక్షల కు సన్నద్ధం అయ్యేలా చూడాలని తెలిపారు.
ప్రతి సోమవారం, మంగళవారం స్టాఫ్ అటెండెన్స్ 100% హాజరవ్వా లని అత్యవసరం ఉంటే తప్ప సెల వు మంజూరు చేయకూడదని ఈ సందర్భంగా చూసి ఆదేశించారు.
వచ్చే సోమవారం ప్రిన్సిపాల్స్ స్టాఫ్ తో సమావేశం నిర్వహించి ఇటీవల విద్యార్థులకి నిర్వహించిన 1,2 టెస్ట్ లకు సంబంధించి ఫలితాలపై సమీ క్ష చేయాలని తదుపరి వార్షిక పరీ క్షల నాటికి ప్రతి విద్యార్థి ప్రతి సబ్జె క్టు లో కనీసం 70 శాతం మార్కులు తెచ్చుకునేందుకు కార్యాచరణ లి ఖిత పూర్వకంగా సంబంధిత సబ్జెక్ట్ టీచర్ నుండి నివేదిక తీసుకోవా ల ని తదుపరి సమావేశం సెప్టెంబర్ 22 న అట్టి నివేదికలపై సమావేశం నిర్వహిస్తా మని తెలిపారు.జిల్లా ఇంటర్ విద్యా అధికారి భాను నా యక్,జి సీ డి ఓ పూలన్,డి సీ ఓ లు పద్మ, లక్ష్మి, ప్రిన్సిపాల్స్, తదిత రులు పాల్గొన్నారు.