–కోదాడలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
–తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు:ప్రభాకర్
TDP Prabhakar : ప్రజా దీవేన, కోదాడ: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి ఓరుగంటి ప్రభాకర్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
కోదాడ పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా బయల్దేరి, మునిసిపాలిటీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పనిచేసిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగాప్రభాకర్ మాట్లాడుతూ, పేదలకు రూ.2 కిలో బియ్యం అందించడం, మండల వ్యవస్థ ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు, పక్కా భవనాలు అందించడం వంటి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ పేదల మనసుల్లో స్థానం సంపాదించిందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు శాసనసభ, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించడం వంటి అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు.
. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు జానపనేని కృష్ణా రావు, మొతే మండల మాజీ అధ్యక్షులు దోసపాటి రాములు, గుడిపూడి వెంకటరమణ, వేమూరి సురేష్, అమరావరపు శ్రీమన్నారాయణ, గద్దె వెంకటేశ్వర్ రావు, గోపిదేశి వివేకానంద, డా. పూర్ణ శంకర్, చల్ల గురవయ్య, గౌని శ్రీనివాసగౌడ్, వసంతకుమార్, వేమూరి నరసింహారావు, భగత్, తాళ్లపాక బాబు, నాగరాజు, పుల్లారావు, మరీదు ఉపేందర్, భాస్కర్, సైదులు, కొవ్వూరి ఓబయ్య, ఉపేందర్, శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.