Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Cabinet Expansion : విస్తరణకు వేళాయే..!

— రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆ నలుగురా, ఐదుగురా

— పలువురి శాఖల్లోనూ భారీగా మార్పులు

–ఏఐసీసీ పెద్దలతో రేవంత్‌, భట్టి, మహేశ్‌, ఉత్తమ్‌ భేటీ

–బహుశా ఉగాదికి ముహూర్తం ఖరారు ఖాయంగా వాతావరణం

Telangana Cabinet Expansion : ప్రజా దీవెన , న్యూఢిల్లి : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలి క్కి వచ్చినట్టు స్పష్టమైన సంకేతా లు వెలువడుతున్నాయి. ఈ నె లా ఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్త యే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమ వారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కా ర్యాలయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ల భేటీలో సుదీర్ఘమైన చర్చ కొనసాగినట్లు విశ్వసనీయ సమాచారం. సాయం త్రం 6.30 గంటలకు మహేశ్‌ కుమా ర్‌ గౌడ్‌ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లగా, 7 గంటల సమయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకేసారి అక్కడికి చేరుకున్నారు.

ఉత్తమ్‌ ఆలస్యంగా వెళ్లి, అందరి కంటే ముందే బయటికి వచ్చేశారు. రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వా యిదా పడుతూ వస్తున్న మంత్రి వర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో నలుగురికా, ఇదుగురికా అవకాశం అనేది మాత్రం గోప్యంగా సాగు తోంది. ఉగాదికే మంత్రివర్గ విస్తరణ తో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకా శాలు ఉన్నాయని అంటున్నారు.

ఆ నలుగురా, ఆ ఐదుగురా…!

ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొంతమంది కీలక నేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించిన ట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వి వేక్‌ వెంకటస్వామిలకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగిన ట్టు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి, ఉ మ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెంది న సుదర్శన్‌రెడ్డిల పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. సుద ర్శన్‌ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు బట్టినట్టు విశ్వసనీయ వర్గాల స మాచారం.

సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నెలకొన్న పరిస్థితిలో కోమ టిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, గడ్డం వివే క్‌, వాకాటి శ్రీహరి ముదిరాజ్‌, సుద ర్శన్‌ రెడ్డి పేర్లు ముందు వరసలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురికే చోటు కల్పించాలని నిర్ణ యించినట్లు తెలుస్తోంది. మరో రెం డు మంత్రి పదవుల భర్తీపై ఎలాంటి చర్చా జరగలేదని పార్టీ వర్గాల ద్వా రా తెలిసింది.

మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ కీలకంగా వి నిపిస్తోంది. దీనిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో ఎస్టీ లంబాడా సామా జిక వర్గానికి అవకాశం కల్పించలేని పక్షంలో డిప్యూటీ స్పీకర్‌గా అవ కాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోం ది. పీసీసీ, కార్పొరేషన్‌ పదవులపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ విష యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానానిదే తుది నిర్ణ యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

విస్తరణ, పీసీసీ పదవులు, సంక్షేమ పథకాలపై అధిష్ఠానం పెద్దల తో చర్చించామన్నారు. అన్ని విష యాలను వారికి వివరించామని అ న్నారు. ఏఐసీసీ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది న్నర పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మల్లికార్జునఖర్గే, రాహుల్‌ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆరో గ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాహుల్‌ చెప్పారన్నారు.

రాష్ట్రంలో ఆ రెండూ అమలు అవుతున్న తీరును ఆరా తీశారని చె ప్పారు. సమీకృత గురుకులాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కార్పొరేషన్‌ చైర్మన్లు, బోర్డుల ని యామకంపై కూడా చర్చ జరి గిందని వెల్లడించారు. త్వరలోనే అధిష్ఠానం నిర్ణయం తీసు కుంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీ సీసీ కార్యవర్గాలపై అధి ష్ఠానంతో దాదాపు ఇదే చివరి సమావేశంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.