Telangana High Court : తెలంగాణ హైకోర్టు భావోద్వేగ వ్యా ఖ్యలు, సమాజం సిగ్గుతో తలదిం చుకోవాల్సిన అవసరం ఉంది
Telangana High Court : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జరుగుతోన్న కొన్ని హృదయ విదారక సంఘటనలపై హైకోర్టు భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. హై దరాబాద్ రామంతాపూర్‌లో ఐదు గురు మరణించిన ఘటన,పుట్టిన రోజు నాడే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనలపై విచారణ సం దర్భంగా హైకోర్టు జడ్జిలు ఉద్వేగ భ రిత వ్యాఖ్యలు చేశారు.
కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలు డు తలకొరివి పెట్టడం తనను తీ వ్రంగా కలచి వేసిందని జస్టిస్ నగేష్ భావోద్వేగానికి గురయ్యారు. విద్యు త్ ప్రమాదంపై ఎవరికి వారు చేతు లుదులు పుకుంటే ఎలా అని ప్రశ్నిం చారు.ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవర ని జస్టిస్ నగేష్ బీమాపాక ప్ర శ్నించారు. ఈ ఘటనతో ప్రతి హృ దయం పగిలిపోయిందని, అందరం బాధ్యు లమేనని జస్టిస్ నగేష్ పే ర్కొన్నారు. ఈ విషయంలో సమా జం సిగ్గుతో తలదించుకోవాలని జ స్టిస్ బీమాపాక నగేష్ స్పందించా రు.
నెట్ వర్క్ కేబుల్ వైర్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. రా మంతాపూర్ ఘటన తర్వాత హైద రాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబు ల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చే లా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టె ల్ సంస్థ కోరింది. అయితే, ఎయిర్ టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హై కోర్టు విచారణ చేపట్టింది.
లైసెన్సు తీసుకున్న కేబుల్స్ తప్ప ఏ వీ ఉంచవద్దని జస్టిస్ నగేష్ బీమా పాక ఆదేశాలు జారీ చేశారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై జ స్టిస్ నాగేష్ బీమాపాక సీరియస్ అ య్యారు. తదుపరి విచారణను వ చ్చే సోమవారానికి తెలంగాణ హైకో ర్టు వాయిదా వేసింది.