Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Jagruthi Youth Convention : జూన్ 2న తెలంగాణ జాగృతి యు వకవుల సమ్మేళనం

–తెలంగాణ జీవన విశిష్టతను చా టి చెప్పడానికే ఈ సమ్మేళనం
–వాల్ పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Telangana Jagruthi Youth Convention :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యు వ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్న ట్లు తెలంగాణ జాగృతి ప్రకటించిం ది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువా రం తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త న నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జీవన శైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహ ను, చైతన్యాన్ని పెంపొందించడా నికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తె లంగాణ తాత్వికతను, చరిత్రక నే పథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే స మిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువకవులు తమ కలాలకు పదు ను పెట్టాలని కవిత పిలుపునిచ్చా రు.

సమ్మేళనంలో పాల్గొనదలచిన క వులు, కవయిత్రులు 35 ఏళ్ల లో పు వారి ఎవరైన తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు విని పించవచ్చు. నమోదు చేయించు కోవడానికి కవులు తమ వివరా లతో ఈ నెల 26 లోపు kavith a.telangana@gmail.com కు మెయిల్ చేయాలి.

కవులు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్పూర్తి ని చాటిచెప్పాలని కవిత పిలుపు నిచ్చారు. తెలంగాణ నేల మీద అ నేక గొప్ప కవులు, కవయిత్రులు త మ రచనల ద్వారా సామాజంలో చైతన్యాన్ని రగిలించారని, ఆ పరం పరంను కొనసాగించడానికి ఈ కా ర్యక్రమం దోహదపడుతుందని అ న్నారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా సురవరం ప్రతాప్ రెడ్డి తె లంగాణ రచయితలు, కవులు, కవ యిత్రుల ఆత్మగౌరవాన్ని చాటి చె ప్పారని, ఆ స్పూర్తితో తాము ముం దుకు సాగుతున్నట్లు తెలియజేశా రు.

అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ సాహిత్యానికి కనీ స గౌరవం ఇవ్వడం లేదని విమ ర్శించారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అలాగే, జానపదానికి గౌర వం దక్కడం కోసం జీవితాంతం కృషి చేసిన బిరుదురాజు శత జ యంతి కు రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని, గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సే వలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు.

ఈ కార్యక్ర మంలో కవులు కాంచన పల్లి, వన పట్ల సుబ్బయ్య, ఘన పురం దేవేం దర్, జాగృతి నాయ కులు నవీన్ ఆచారి, శ్రీధర్ రావు, మనోజ్ గౌడ్, లలిత యాదవ్ తది తరులు పాల్గొన్నారు.