Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalist Forum Silver Jubilee : మే 31 న టీజేఎఫ్ రజతోత్సవాలు

–మీడియా అకాడమీ తొలిమాజీ చైర్మన్, టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ

Journalist Forum Silver Jubilee : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలం గాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించి న చారిత్రాత్మక పాత్రను తెలియ జే యడం కోసం మే 31 న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తున్నా మని మీడియా అకాడమీ తొలి మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షులు అల్లం నారాయణ వెల్లడించారు. 2001 మే 31న ఆవిర్భవించిన తె లంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తె లంగాణ రాష్ట్రం సాధించేంత వర కు, 2014 దాకా ఎన్నో సందర్భా ల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని అల్లం నారాయణ తెలిపారు. వివి ధ ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను, విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. మాక్ అసెంబ్లీ, ఛలో ఢిల్లీ, సాగర హారం, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలను చేసిన ఘనత జర్నలిస్ట్ ఫోరందని అల్లం నారాయణ పేర్కొన్నారు.

ఉద్యమం చల్లబడ్డప్పుడల్లా టీజే ఎఫ్ కీలకపాత్ర పోషించి ఉద్యమా న్ని ముందుకు నడిపింది అల్లం నా రాయణ గుర్తు చేశారు. ఇలాంటి ఎ న్నో విషయాలను సమాజానికి మ రోసారి తెలియజెప్పడానికి హైద రాబాద్ నెక్ల్ స్ రోడ్డు లోని జలవి హార్ లో ఈ నెల 31న టీజేఎఫ్ ర జతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అల్లం నారాయణ తెలిపారు.

తె లంగాణ జర్నలిస్టుల ఫోరమ్ చేసి న ఉద్యమం మిగతా ఉద్య మాల కు ఒక దిక్సూచిలాంటిదని టీజేఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్య దర్శి క్రాంతి కిరణ్ అన్నారు. మే 31 న జలవిహార్ లో నిర్వహించే టీజే ఎఫ్ రజతోత్సవాల పోస్టర్ ను సో మాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవా రం ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్ర ధాన కా ర్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, ఎ. రమణకుమార్, పి.శశి కాంత్, ఎం.వి.రమణ, కోశాధికారి పి. యోగానంద్, జాయింట్ సెక్రట రి యార నవీన్ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు అ వ్వారి భాస్కర్, టీయూ డబ్ల్యూ జే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాకేష్ రెడ్డి, సోమేశ్వ ర్, కోశాధికారి బాబు రావు, కళ్యా ణ్ చక్రవర్తి, చిన్న పత్రికల సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగస్టీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.